ఆ ఒక్క కారణం తో ఎన్టీఆర్ 30 సినిమా ని వదులుకున్న రష్మీక..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో  తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది కనడ భామ రష్మిక మందన. తెలుగు సినీ ఇండస్ట్రీకి చలో మూవీ తో తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.దాని అనంతరం ఈ సినిమా హిట్ అవ్వడంతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీత గోవిందం సినిమాలో నటించింది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత నుండి వరుస సినిమాలో చేస్తూ నేషనల్ క్రష్ గా కూడా రష్మిక మందన మంచి క్రేజ్ అందుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటించింది. 

ఇక ఈ సినిమాలో శ్రీవల్లిగా అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో నటించిన అనంతరం రష్మిక కి పాన్ ఇండియా లెవెల్ గుర్తింపు కూడా లభించింది. అయితే పుష్ప సినిమా అనంతరం ఈమెకి సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా అవకాశాలు రావడం జరిగింది. దాంతో బిజీబిజీగా సినిమాలు చేస్తోంది రష్మిక. అయితే రష్మిక కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.. అయితే జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఎన్టీఆర్ 30 సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకుందట రష్మిక. జూనియర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా ఇది. ఇక నందమూరి తారకరామారావు ఆర్ట్స్ ,యువర్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రానుంది.

 ఇక  ఫిబ్రవరి నుండి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం రష్మికను సంప్రదించారట చిత్ర బృందం. అయితే పుష్ప సినిమా తర్వాత భారీగా రెమ్యూనరేషన్ను పెంచేసిన రష్మిక ఈ సినిమా కోసం ఏకంగా 6 కోట్లు డిమాండ్ చేసిందని తెలుస్తోంది .అంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఒప్పుకోలేదట చిత్ర బృందం. రష్మిక కూడా ఈ విషయంలో ఏమాత్రం తగ్గలేదట. దీంతో మేకర్స్ రష్మిక అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడంతో రష్మిక ఈ సినిమాని రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఇక రష్మిక ఈ సినిమాకి నో చెప్పడంతో  జాన్వీ కపూర్ ని ఈ సినిమాకి హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్త తెలిసిన అనంతరం చాలామంది రష్మిక అభిమానులు రెమ్యూనరేషన్ కోసం ఎన్టీఆర్ సినిమాని వదులుకుంటావా అంటూ కామెంట్లు చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: