చిరంజీవి దానికి పనికిరాడు.. షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు బాబీ..!?

Anilkumar
టాలీవుడ్  మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే వాల్తేరు వీరయ్య సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో చాలా ఘనంగా జరిపించారు. ఇక ఈ వేడుకకి చిత్ర బృందంతో పాటు వాల్తేరు వీరయ్య సినిమా దర్శకుడు బాబి మరియు చిరంజీవి అలాగే మాస్ మహారాజ రవితేజ కూడా వచ్చారు. మాస్ మహారాజ రవితేజ మరియు చిరంజీవి కాంబినేషన్లో రానున్న ఈ సినిమాని చూడడానికి ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

వీరితోపాటు ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి భారీ జనం రావడం జరిగింది. అటు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మరియు ఇటు మాస్ మహారాజ రవితేజ అభిమానులు కూడా భారీగా తరలి రావడంతో వాల్తేరు వీరయ్య సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలు చాలా గ్రాండ్గా జరిగాయి. అయితే ఇందులో భాగంగానే ఈ సినిమా దర్శకుడు బాబి కొన్ని వ్యాఖ్యలను చేయడం జరిగింది. ఇందులో భాగంగానే బాబీ చిరంజీవి గురించి మాట్లాడుతూ.. చిరంజీవికి రాజకీయాలు కొంచెం కూడా రాదని.. రాజకీయాల్లో చిరంజీవికి సరిపడవని.. రాజకీయాలను చూసుకొనేందుకు దేవుడు ఆయనకి గొప్ప తమ్ముడిని ఇచ్చాడని చెప్పుకొచ్చాడు.

అంతేకాదు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో గట్టిగా నిలబడాలని.. ప్రత్యర్థులకు తగిన రీతిలో సమాధానాలు ఇవ్వాలని.. చిరంజీవిలోని మంచితనం ఆవేశం కలిపితేనే పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చాడు బాబి.అంతేకాకుండా చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ఇద్దరితో బాబి పనిచేశానని ..వారిద్దరూ చాలా మంచి వారిని.. వారిద్దరిలో అదే మంచితనం అదే ప్రేమ ఉన్నాయని.. మాటకు మాట కత్తికి కత్తి అనే పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు సరిగ్గా సూట్ అవుతాయని ...చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురిపించాడు బాబి .దీంతో బాబి చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: