సినిమ హిట్ అవ్వడంకోసం అలాంటి పనులు చేస్తున్న పూజ హెగ్డే..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట ఈమె సినీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వరుస ప్లాప్ సినిమాలలో నటించి ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. దాని అనంతరం టాలీవుడ్ లో ఈమెకు అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా పూజ హెగ్డే సక్సెస్ ను అందుకోలేదు. దాంతో మళ్లీ టాలీవుడ్ లోకి వచ్చింది. రెండోసారి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ సరైన విజయాన్ని అందుకోలేకపోయింది. దాని అనంతరం కొన్నాళ్లకి వరుస సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది.
దాంతో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది పూజ హెగ్డే .రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో డిమాండ్ చేస్తుంది. అయితే అంత పెద్దగా కలిసి రాలేదు అని చెప్పాలి. ఎందుకంటే ఏమైనాటించిన బీస్ట్ ,ఆచార్య,రాధేశ్యాం ఈ మూడు సినిమాలు కూడా విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో మళ్లీ ఈమెని అందరూ ఐరన్ లెగ్ అని అనడం ప్రారంభించారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఇప్పుడు మహేష్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమాల్లో నటించనుంది ఉంది పూజ హెగ్డే. దీంతో అటు బాలీవుడ్ లో సినిమాలో చేసినప్పటికీ అంతగా సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలోనే మహేష్ సినిమాతో అన్నా మళ్లీ ఫామ్ లోకి వస్తుందా అన్నది చూడాలి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఈరోజు నుండి మొదలు కానుంది.
తాజాగా హైదరాబాద్ కి వచ్చింది పూజ హెగ్డే. అయితే ఈ నేపథ్యంలోనే ఒక కూల్ డ్రింక్ యాడ్ షూట్ లో పాల్గొని షూటింగ్ అనంతరం పూజా హెగ్డే సంజీవయ్య పార్క్ దగ్గర్లో ఉన్న పెద్దమ్మ గుడికి వెళ్ళింది. అయితే చాలా కాలం నుండి పూజ హెగ్డే ఈ గుడికి వెళ్లాలని భావిస్తుంది. కానీ కుదరక ఇన్ని రోజులు వెళ్లలేకపోయింది. తాజాగా ఈ గుడికి వెళ్లి దర్శించుకుంది పూజ హెగ్డే.దీంతో చాలామంది నెటిజన్స్ ఈమధ్య పూజ హెగ్డే నటించిన అన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈ సినిమా అయినా మంచి సక్సెస్ను అందుకోవాలని గుడికి వెళ్లి దర్శించుకుంది అని అంటున్నారు. అంతేకాదు ఈమధ్య ఈమె సినిమాలు వరుసగా ఫ్లాప్ లో అయ్యాయి కాబట్టి పూజా హెగ్డే కి ఏదైనా దోషము ఉందేమో అందుకే ఇలా అవుతోంది అని దోష నివారణ కోసం ఆ గుడికి వెళ్లిందని చాలామంది అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: