రామ్ ఎత్తుకున్న ఈ బుడ్డోడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో రామ్ పోతినేని కూడా ఒకరు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ స్టార్ గా మంచి గుర్తింపును పొందాడు రామ్. ఇటీవల రామ్ హీరోగా నటించిన ది వారియర్ సినిమా ఫ్లాప్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా అనంతరం రామ్ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. ఇక ఈ సినిమాలో రామ్ కి జోడిగా శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. అయితే గతేడాది రామ్ కి పెళ్లి అయింది అంటూ సోషల్ మీడియా వేదికగా అనేక రకాల వార్తలు వచ్చాయి. 

రామ్ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు అని..రామ్ త్వరలోనే ఈ విషయాన్ని బయటపడతాడు అని ..రకరకాల వార్తలు రావడం జరిగింది. ఇందుకుగాను గతంలో రామ్ మాట్లాడుతూ ఆ అమ్మాయి ఎవరో చెప్తే నేను కూడా చూస్తాను.. మా ఇంట్లో కూడా ఈ వార్తలు నిజమని అనుకుంటున్నారు.. నువ్వు ఎప్పుడో పెళ్లి చేసుకుంటున్నావు అని నన్ను అడుగుతున్నారు.. ఆ అమ్మాయి ఎవరో చెప్పండి అంటూ అడిగాడు రామ్... దీంతో పెళ్లిపై వస్తున్న వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టాడు రామ్. అయితే తాజాగా రామ్ తన సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను షేర్ చేశాడు. అందులో భాగంగానే ఒక చిన్న పిల్లాడిని ఎత్తుకొని నవ్వుతున్నాడు.

ఇక రామ్ షేర్ చేసిన ఈ ఫోటో కింద క్యాప్షన్ గా.. ఎందుకంటే ఈరోజు సండే. సిద్ధాంత్ పోతినేని అని రాశాడు. ఇక ఈ ఫోటోతో మరోసారి లేనిపోని అనుమానాలకు తావిచ్చాడు రామ్. ఇక ఈ ఫోటో చూసి నేను చాలామంది..అసలు రామ్ కి పెళ్లి అయి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా.. అసలు రామ్ కి పెళ్లెప్పుడు అయింది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే రామ్ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు అని.. తమ ఇష్టానుసారం కామెంట్లను చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే.. ఈ బుడ్డోడు రామ కొడుకు కాదు అసలు రాముకి ఇంకా పెళ్లి కాలేదు సిద్ధాంత్.. రామ్ అన్న కొడుకు. ఈ బుడ్డోడు ఎప్పుడూ రామ్ తో ఆటలాడుతూ చాలా సార్లు కనిపించడం జరిగింది. సమయం దొరికినప్పుడల్లా రామ్ తో ఆడుకుంటూ ఉంటాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: