బాలకృష్ణకు మళ్ళీ దెబ్బేసిన నాగార్జున..!?

Anilkumar
సాధారణంగా సినీ సెలబ్రిటీల మధ్య మంచి అనుబంధాలు ఉంటాయి.మంచి స్నేహితులుగా ఉన్నప్పటికీ కొందరి మధ్య కొన్ని గొడవలు వస్తూ ఉంటాయి. ఇక ఆ గొడవలకి కారణం వారు చేసే సినిమాలు కావచ్చు లేదా వ్యక్తిగత విషయాలు కూడా కావచ్చు.అయితే అలా కొన్ని కారణాలవల్ల నాగార్జున మరియు బాలకృష్ణ మద్య కొంత గ్యాప్ ఏర్పడింది. అయితే దాదాపు పది సంవత్సరాల నుండి ఈ ఇద్దరు సీనియర్ హీరోలు దూరంగానే ఉంటున్నారు. ఏదైనా సినిమా ఫంక్షన్లో ఎదురుపడితే కూడా వీరిద్దరూ మాట్లాడుకోరు. అయితే ఇలా వీరిద్దరి మధ్య దూరం పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తుంది.

గతంలో అక్కినేని నాగేశ్వరరావు చనిపోతే బాలకృష్ణ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే.అయితే దాని అనంతరం నాగార్జున తన తండ్రి జ్ఞాపకార్థం ఒక సభను పెట్టడం జరిగింది.ఇక ఈ సభకి గాను నాగార్జున అందరినీ పిలిచాడు కానీ బాలయ్యని మాత్రం ఆ సభకు పిలవలేదు.ఇలా కొనసాగుతూ రావడంతో వీరిద్దరి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే ఇటీవల నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ షోని బాలకృష్ణ చేయాలి అంటే బిగ్ బాస్ సెట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉండకూడదు అని కండిషన్ పెట్టినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలోని కొంత భాగం కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే జరిగింది. ప్రస్తుతం బాలకృష్ణ హోస్ట్ గా  వ్యవహరిస్తున్న షో కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే జరుగుతుంది. అయితే ఆ స్టూడియోస్ లోనే బాలకృష్ణ షో చేస్తున్నప్పటికీ ఈ షో ని నాగార్జున ని మాత్రం ఇంకా పిలవలేదు. అయితే తాజాగా వీళ్ళిద్దరి మధ్య ఉన్న వివాదాలు మరోసారి బయటకు వచ్చాయి. ఈ సంక్రాంతి కానుకగా చిరంజీవి సినిమా మరియు బాలయ్య సినిమా ఒకేసారి విడుదల కానున్నాయి. రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడంతో చిరంజీవి సినిమాలకి థియేటర్లు తక్కువ దొరికాయట. అయితే ఈ క్రమంలోనే నాగార్జున ఆయన అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ద్వారా కృష్ణ, గుంటూరు జిల్లాలో చిరంజీవి సినిమాకి ఎక్కువ థియేటర్స్ దక్కేలా నాగార్జున ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: