పవర్ స్టార్ ఈ ఇయర్ అన్నీ సినిమాలు చేయడానికి కారణం అదేనా...!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏ స్టార్ కి లేనంత క్రేజ్ ఉన్న  స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన సినిమా వస్తుంది అంటే అభిమానులకి ఒక నెల రోజుల నుండి పండగ వాతావరణమే. ఆయన సినిమాలు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.తన కున్న యాక్టింగ్, స్టైల్ తో చాలా మంది ఫ్యాన్స్ను సంపాదించుకున్నాడు. ప్రెసెంట్ ఆయన కొన్ని రోజులు పాలిటిక్స్ లలో మరీ కొన్ని రోజులు మూవీస్ చేస్తూ వస్తున్నాడు.ఐతే ఆయన ప్రెసెంట్ చేస్తున్న మూవీస్ లలో 'హరిహర వీరమల్లు' దీనికి క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ చేస్తున్నారు.
ఐతే ఇది ఇలావుంటే మరో వైపు హరీశ్ శంకర్ తో మొదట్లో అనుకున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ వదిలేసి ,తమిళ మూవీ ఐనా ' తెరి ' ను రీమేక్ కోసం స్క్రిప్ట్ రెడీ చేయమని పవన్ హరీష్ కు చెప్పాడంట.ప్రెసెంట్ ఆయన  చేతిలో సుజిత్ డైరెక్షన్లో రెడీ అవుతున్న మూవీ కూడా ఉంది.ఇదిలావుంటే ఆయన ఒకవైపు నటుడు సముద్ర ఖని డైరెక్షన్ లో రెడీ అవుతున్న మూవీ కు కూడా  డేట్స్ ఇచ్చాడు.ఐతే ప్రెసెంట్ ఆయనకు ఇన్ని మూవీస్ చేయడం అనేది ఒక టాస్క్ లాంటిది.
దీన్ని బట్టి చుస్తే పవన్ చేతిలో ప్రెసెంట్ నాలుగు మూవీస్ ఉన్నాయి. ఇవన్నీ పవన్ ఒప్పుకోడానికి కారణం నెక్స్ట్ ఇయర్ ఆయన మూవీస్ చేసే సమయం ఉండదు ఎందుకంటె ఆయన ఎలక్షన్స్ లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అందుకే ఇ సంవత్సర్ం మాక్సిమమ్ సినిమాలు చెసి వచ్చిన డబ్బులతో ఎలక్షన్స్ కు ఖర్చు చేయాలనీ చూస్తునట్లు సమాచారం.
ఎలాగైనా పవర్ స్టార్ మాత్రం ఇటు సినిమాలతో అటు రాజకీయాలతో బిజీ బిజీ గా ఉండి రెండు వైపులా బాలన్స్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇటు ఫ్యాన్స్ ని వదులుకోలేరు అలాగని అటు జనాలని వదులుకోలేరు అని చెప్పకనే చెప్తున్నారు మేధావులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: