ఈ పవన్ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ఎక్కడుందో, ఏం చేస్తుందో తెలుసా..?

Anilkumar
టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు వచ్చారు. వారిలో కొంతమంది చాలాకాలం నుంచి స్టార్ హీరోయిన్స్ గా వెలుగొందుతున్నారు. మరి కొంతమంది సినిమాలకు బ్రేక్ ఇచ్చి సెటిల్ అయిపోతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంతోమంది హీరోయిన్లకు బ్రేక్ ఇచ్చింది. అయితే కొంతమంది హీరోయిన్లకు అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చిన తమ స్టార్ డం ని నిలబెట్టుకోలేకపోయారు. అలాంటి హీరోయిన్స్ లో పార్వతి మెల్టన్ ఒకరు. వెన్నెల సినిమాతో తెలుగు వెండితరకి హీరోయిన్గా పరిచయమైన పార్వతి మెల్టన్.. ఆ తర్వాత చాలామంది హీరోల సరసన నటించింది. 

హీరోయిన్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ తో కుర్రకారును ఆకట్టుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా, సూపర్ స్టార్ మహేష్ బాబు దూకుడులో ఐటమ్ సాంగ్ తో అదరగొట్టింది. అయితే చాలాకాలంగా ఆమె తెలుగు వెండితెరకి దూరమైంది. కొన్ని ఏళ్ల కింద పెళ్లి చేసుకుని ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటుంది. ఇటీవలే ఈమెకు బాబు కూడా జన్మించాడు. అమెరికాలో పుట్టి పెరిగిన పార్వతి మెల్టన్ కి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం. కాలిఫోర్నియాలో డిగ్రీ చదివేటప్పుడు భరతనాట్యం నేర్చుకొని అక్కడ పలు ప్రదర్శనలు ఇచ్చి అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేసింది.

అలా 2004లో మిస్ ఇండియా గా అలాగే 2005లో యూఎస్ఏ మిస్ ఇండియా అమెరికాగా ఎంపికైంది. అయితే పార్వతి మెల్టన్ డిగ్రీ చదువుతున్న సమయంలో ఆమెకు తెలుగులో వెన్నెల అనే సినిమాలో నటించే అవకాశం రావడంతో హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో తన స్టడీస్ కంప్లీట్ చేసి సినీ ఇండస్ట్రీకి వచ్చేసింది. తెలుగులోనే కాదు మలయాళం లో కూడా పలు సినిమాల్లో నటించింది. మలయాళం లో మోహన్ లాల్ తో హలో గ్రాండ్ అనే సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఇక తెలుగులో అల్లరే అల్లరి, గేమ్, మధు మాసం, జల్సా, దూకుడు, శ్రీమన్నారాయణ, యమహో యమ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తర్వాత మెల్లిమెల్లిగా ఈమెకు అవకాశాలు రావడం తగ్గిపోయాయి. దీంతో అమెరికాలో ఓ పారిశ్రామికవేత్తను పెళ్లి చేసుకొని న్యూ జెర్సీలో సెటిలైంది. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి న్యూ జెర్సీలో హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తోంది ఈ హీరోయిన్...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: