మురారి సినిమాతో రాజీవ్ గాంధీ మరణానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

Anilkumar
టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి క్రేజీ ఉందో అందరికి తెలిసిందే. పాన్ ఇండియా ఇమేజ్ తో సంబంధం లేకుండా సౌత్ లోనే టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్. ఇక ఆయన సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కి పండగే. ఇక ఇప్పటివరకు మహేష్ కెరియర్ లో ఎన్నో బిగ్గెస్ట్ బ్లాక్ మాస్టర్ సినిమాలు ఉన్నాయి. వాటిలో 'మురారి' సినిమా కూడా ఒకటి. ఈ సినిమా మహేష్ సినీ కెరీర్ లోనే మొదటి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అప్పటివరకు ప్రేమ కథలు చేస్తూ వచ్చిన మహేష్ ను మురారి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా దగ్గర చేసింది. ఈ సినిమాలో మహేష్ నటన, కృష్ణవంశీ డైరెక్షన్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు కి జోడిగా సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాతో రాజీవ్ గాంధీ హత్యకు ఓ చిన్న లింకుందట.

అదేంటంటే.. దర్శకుడు కృష్ణవంశీ ఒకసారి  ఓ లాంచీలో ప్రయాణిస్తుండగా ఆ లాంచీలో కూర్చున్న వాళ్లంతా రాజీవ్ గాంధీ గారి హత్య గురించి మాట్లాడుకుంటున్నారట. ఆ క్రమంలోనే ఆ లాంచీలో ఒకతను వారి కుటుంబానికి శాపం ఏమైనా ఉందేమో.. అందుకే వరుసగా వారి కుటుంబంలో అలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నాడట. ఇక అది విన్న మన కృష్ణవంశీ శాపం కారణంగా మనుషులు చనిపోవడం అనే కాన్సెప్ట్ ని తీసుకొని దానికి ఫ్యామిలీని ఎమోషన్స్ జోడించి మురారి కథను రాసుకున్నారట. ఇక మహేష్ బాబు ని చూడగానే కృష్ణుడి లాగా అనిపించాడట.

దీంతో అప్పటి వాతావరణమంతా ఆయన మైండ్లో తిరగడం మురారి కథకు భాగవతం, భారతం లోని పాత్రలను జోడించడం జరిగిందని గతంలోని కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.ఇక ఆ కథాంశంతోనే మురారి సినిమాను తీసాడట కృష్ణవంశీ. ఇక ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుని దర్శకుడిగా కృష్ణవంశీ స్థాయిని మరింత పెంచింది. ఇక మణిశర్మ అందించిన మురారి ఆల్బమ్ కూడా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ముఖ్యంగా సినిమాలో పెళ్లి సాంగ్ ఇప్పటికీ ఎక్కడో చోట పెళ్లిల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఇక ప్రస్తుతం కృష్ణవంశీ విషయానికొస్తే.. 'రంగమార్తాండ' అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, బ్రహ్మానందం తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రను పోషిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: