నేను కూడా అలాంటి పని చేసి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేదాన్ని.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్నేహా ఉల్లాల్..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఐశ్వర్యరాయ్ గా పేరు తెచ్చుకున్న స్నేహ ఉల్లాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అప్పట్లో వరుస సినిమాలలో నటించిన ఈమె ఇప్పుడు కనిపించడం లేదు. గతంలో ఐటమ్ సాంగ్స్ చేయడానికి ఏమాత్రం ఇష్టపడని ఈమె ప్రస్తుతం ఎలాంటి ఐటమ్ సాంగ్ లలో అయినా నటించడానికి సిద్ధమవుతోంది. అయితే తనకు అవకాశాలు రాకపోవడమే ఇలాంటి నిర్ణయానికి కారణం అని తెలుస్తుంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఐటమ్ సాంగ్స్ గురించి పలు కామెంట్లను చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ...

" ఐటెం సాంగ్స్ చేయడం అంటే నాకు ఇష్టం ఉండదు.. నేను ఐటెం సాంగ్స్ చేయడానికి అసలు ఇష్టపడను.. కానీ ఇప్పుడు మనసు చంపుకొని ఐటమ్ సాంగ్స్ లో నటించాల్సి వస్తుంది.. అంటూ చెప్పుకొచ్చింది ఈమె. ఇందులో భాగంగానే నేను సినిమా ఎంపికలతో పాటు ఎక్స్పోజింగ్ విషయాలలో కూడా కొన్ని పరిమితులను పెట్టుకున్నాను.. అందుకే నేను హీరోయిన్గా వెనుకబడ్డాను కావచ్చు.. అంటూ చెప్పుకొచ్చింది.కొన్ని కొన్ని సార్లు మనం ఏ పని అయితే జీవితంలో చేయకూడదు అనుకుంటామో సందర్భం వచ్చినపుడు అలాంటి పనులే చేయాల్సి వస్తుంది.. గతంలో ఐటమ్ సాంగ్స్ లో నటించేందుకు నాకు చాలా అవకాశాలు వచ్చాయి..

అయినప్పటికీ నేను నటించలేదు.. అవకాశాలు వచ్చిన సమయంలోనే నేను నా రూల్స్ ని బ్రేక్ చేసి స్కిన్ షో చేసి ఉంటే బాగుండేదేమో.. ఇప్పుడు నేను కూడా ఒక స్టార్ హీరోయిన్గా కొనసాగేదాన్నేమో.. అంటూ చెప్పుకొచ్చింది స్నేహ. అయితే ప్రస్తుతం ఈమె ఒక తెలుగు సినిమాలో ఐటమ్ సాంగ్ చేయనుంది. ఇప్పటికే నేను సినిమా విషయాలలో చాలా లేట్ చేశాను.భవిష్యత్తులో అయినా స్పెషల్ సాంగ్స్ చేస్తే అవకాశాలు వస్తాయి ఏమో అందుకే ఐటెం సాంగ్ లలో నటించటానికి రెడీ అయ్యాను ...ఈ పని గతంలోనే చేసి ఉంటే బాగుండేది ఏమో అంటూ చెప్పుకొచ్చింది స్నేహ ఉల్లాల్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: