స్టార్ హీరోయిన్ తో సంతోష్ వాట్సాప్ చాట్ లీక్ చేసిన సుమ..!?

Anilkumar
బుల్లితెరపై టాప్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె ఎనర్జీతో ఈమె చేసే షోలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఏ షో నైనా ఈమె ఎనర్జీతో అందరిని అమాంతం ఆకట్టుకుంటుంది సుమ. ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకుంది. కొత్త సినిమాల ఈవెంట్స్ తో పాటు కొత్త టీవీ షోలకి కూడా యాంకర్ గా వ్యవహరిస్తోంది సుమ. అయితే తాజాగా సుమా అడ్డ అని ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ని మొదలుపెట్టింది సుమ. అయితే ఇంతకు ముందు సుమా హోస్ట్గా వ్యవహరించిన క్యాష్ ప్రోగ్రామ్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. 

కానీ ఇప్పుడు ఆ షో ప్రసారం కావడం లేదు. దీనికిగాను సుమా అడ్డ అనే సరికొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టింది సుమ. ఇక తాజాగా సుమా మొదలుపెట్టిన ఈ షో జనవరి 7 నుండి ప్రసారం కానుంది.అయితే దీనికి సంబంధించిన ఒక తాజా ప్రోమో ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఎపిసోడ్ కిగాను సంక్రాంతికి విడుదల కాలున్న కళ్యాణం కమనీయం మూవీ టీం రావడం జరిగింది. ఇక ఇందులో భాగంగానే హీరో సంతోష్ శోభన్ ,ప్రియ భవాని శంకర్లతోపాటు దర్శకుడు తదితరులు కూడా ఈ షో కి హాజరయ్యారు.అయితే చివరి వరకు చాలా సందడి సందడిగా కొనసాగిన ఈ షో చివరిలో సుమ...

ఈ సినిమా హీరో సంతోష్ వాట్సప్ చాట్ ని బయటపెట్టింది. అయితే ఇందులో భాగంగానే అనుపమతో సంతోష్ చాట్ ను లీక్ చేసింది సుమ.అంతేకాదు సన్నిలియోన్ కి కూడా సంతోష్ మెసేజ్ లు పెట్టడం జరిగింది. ఇక వాటిని కూడా లీక్ చేసింది సుమ. దీంతో సంతోష్ అనుపమతో ఏం చాట్ చేశాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఎంతో అద్భుతంగా ఉన్న ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ షో ని ఎప్పుడు ఎప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: