అరెరే.. కాజల్ పరిస్థితి ఏంటి ఇంత దారుణంగా మారిపోయింది..?

Anilkumar
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో అగ్ర హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది అందాల తార కాజల్ అగర్వాల్. 'లక్ష్మీ కళ్యాణం' అనే సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత చందమామ అనే సినిమాలో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఆ సినిమాతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అనతి కాలంలోనే అగ్ర హీరోలు సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. సుమారు తన 15 ఏళ్ల సినీ కెరీర్ లో యువ హీరోలు, స్టార్ హీరోలు, సీనియర్ హీరోలు అందరితో నటించి మెప్పించింది. అటు తమిళంలో కూడా సినిమాలు చేస్తూ అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

ఇక వరుస సినిమాలు చేస్తున్న క్రమంలోనే కాజల్ పెళ్ళికి సిద్ధమయింది. ముంబై బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లుని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. 2020 కరోనా లాక్ డౌన్ లోనే వీరి పెళ్లి జరిగింది. ఇక పెళ్లి తర్వాత కూడా పలు సినిమాల్లో నటించింది. అలా సినిమాలు చేస్తున్నప్పుడే తనకు ప్రెగ్నెన్సీ రావడంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఇక గత సంవత్సరం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్.. ఇటీవల సినిమాల పరంగా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ పరిస్థితి మరింత దారుణంగా ఉందని సమాచారం. తన సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ కి కనీసం ఒక్క సినిమా ఆఫర్ కూడా రావడం లేదంట.

తాను ప్రస్తుతం సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతున్నా.. దర్శక నిర్మాతలు ఆమె వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అటు సోషల్ మీడియాలో సైతం కాజల్ తన అందంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఎంత ప్రయత్నించినా కానీ ఫలితం మాత్రం దక్కడం లేదట. ప్రస్తుతం కాజల్ కమలహాసన్ 'ఇండియన్ 2' సినిమాలో నటిస్తోంది. సంచలన దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే పెళ్లికి ముందే ఈ ప్రాజెక్టుకి సైన్ చేసింది కాజల్. ఇక ఇండియన్ 2 తప్ప ఇప్పటివరకు మరో సినిమాకి కాజల్ సైన్ చేయలేదని అంటున్నారు. కానీ కాజల్ మాత్రం స్టార్డంతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎదురుచూస్తోంది. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ కి ఏ దర్శకుడు ఛాన్స్ ఇస్తాడో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: