ఎన్టీఆర్ సినిమాకి అలాంటి కండీషన్లు పెడుతున్న జాన్వీ.. !?

Anilkumar
అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె ఎంట్రీ ఇస్తుంది అంటూ అనేక రకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే చాలా సందర్భాల్లో జాన్వికపూర్ సైతం తనకి తెలుగు సినిమాలలో నటించాలని ఉంది అంటూ వెల్లడించింది. అయితే ఇందులో భాగంగానే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఎన్టీఆర్ 30 సినిమాలో జాన్వి నటిస్తుంది అని.. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా జాన్వీ ఈ సినిమాలో నటించడానికి నిర్మాతలకు అనేక రకాల కండిషన్లను పెడుతున్నట్లుగా సమాచారం. దీంతో చాలామంది నిర్మాతలు జాన్వీకపూర్ షరతులు అన్ని విన్న అనంతరం ఆమెతో సినిమా చేయడం కాని పని అని అభిప్రాయపడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం తెలుగు సినిమాలలో నటించేందుకు భారీ రెమ్యూనరేషన్ను కూడా డిమాండ్ చేస్తుంది జాన్వి కపూర్.అయితే తను నటించిన సీన్లను కొంచెం కూడా కట్ చేయొద్దు అని షరతులు పెడుతోందట ఈమె. అంతేకాదు సినిమా ఓకే చేసిన తర్వాత స్క్రిప్ట్ లో కానీ తనకి సంబంధించిన క్యారెక్టర్ లో

 కానీ ఎలాంటి మార్పులు చేయకూడదని చెబుతోందట.. ఏ స్టార్ హీరోయిన్ లో పెట్టని షరతులను జాన్వీ కపూర్ పెట్టడంతో ఇప్పుడు అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీంతో ఈ వార్త విన్న అనంతరం చాలామంది సినీ నిర్మాతలు జాన్వితో సినిమా చేయాలి అంటే చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జాన్వీ కపూర్ ఒక్క సినిమాకి  నాలుగు కోట్ల రూపాయలు తీసుకుంటుంది. ఇక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లోకి ఎన్టీఆర్ సినిమాతో ఎంట్రీ ఇస్తే జాన్వి కపూర్ మరింత రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంది అని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఈమె  ఎలాంటి సినిమాల్లో నటిస్తుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: