శంకర్ పై కోపంగా ఉన్న రామ్ చరణ్, దిల్ రాజు.. ఎందుకో తెలుసా.. !?

Anilkumar
పాన్ ఇండియా దర్శకుడు శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తన 15వ సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమా ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని నానా రకాలుగా ప్రయత్నిస్తున్నాడు శంకర్. అయితే శంకర్ ఈ సినిమాతో సమాజంలో జరిగే సీరియస్ పాయింట్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లుగా తెలుస్తోంది. దాంతోపాటు ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండు పాత్రలో కనిపించనున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాలోని ఎలక్షన్ ప్రచారం కు సంబంధించిన ఒక సీన్ ను విశాఖ లో షూట్ చేయడం జరిగింది. 

ఇక అప్పట్లో ఈ లొకేషన్ సీన్లను కొందరు లీక్ చేయడంతో అప్పట్లో సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. ఇందులో భాగంగానే ఒక ఓల్డ్ గెటప్ లో రామ్ చరణ్ తన పార్టీ గుర్తుకు ఓట్లు వేయమని చెప్తుంటాడు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఈసారి కర్నూలు జిల్లాలో ఉన్న కొండారెడ్డి బురుజు దగ్గర తీయనున్నారని తెలుస్తుంది. అయితే శంకర్ అనుకున్న దాని ప్రకారం రామ్ చరణ్ సినిమాకు పది రోజులు మరియు కమలహాసన్ సినిమాకి పది రోజులు కేటాయించాలని అనుకున్నాడు. అలాగే ఈ సినిమా షూటింగ్లను మేనేజ్ చేస్తున్నాడు శంకర్.

 కానీ దిల్ రాజు అనుకున్న ప్లాన్ ని బట్టి చూస్తే అదనంగా ఈ సినిమాలకి బడ్జెట్ పెరిగిపోతుంది. అయితే శంకర్ మరియు కమలహాసన్ కాంబినేషన్లో రానున్న ఇండియన్ 2 సినిమాను ఈ ఏడాది సమ్మర్ చివరలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. శంకర్ సినిమాలను పక్క ప్లాన్ తో తీస్తాడు. హడావిడిగా సినిమాలను చేయడానికి ఇష్టపడడు. అయితే కమలహాసన్ సినిమా ఎఫెక్ట్ మొత్తం ఇప్పుడు రామ్ చరణ్ మరియు దిల్ రాజుల సినిమాపై పడుతున్నట్లు తెలుస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం రామ్ చరణ్ తో షూటింగ్ పూర్తి చేయాలని శంకర్ పై కోపంగా ఉన్నారట రామ్ చరణ్ మరియు దిల్ రాజు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: