నయనతారను పొగడ్తలతో ముంచెత్తుతున్న నెటిజన్స్...!!

murali krishna
సౌత్ స్టార్ హీరోయిన్ మరియు లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఆ తర్వాత కోలీవుడ్ కి చెక్కేసిన సంగతి తెలిసిందే.
కోలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ పెద్ద స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును కూడా ఏర్పరచుకుంది. కేవలం టాలీవుడ్ కోలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి అందరిని మెప్పించింది. నయనతార కోలీవుడ్ స్టార్ట్ దర్శకుడు అయిన విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆరేళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట గత సంవత్సరం పెళ్లి చేసుకున్నారు.. అంతే కాకుండా సరోగసి ద్వారా కవల పిల్లలకు కూడా జన్మనిచ్చారు. ఇకపోతే ఈమధ్య కాలంలో నయనతార పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది.. తరచూ ఏదో ఒక విషయంలో నయనతార పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే ఇటీవలే ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా సెలబ్రిటీలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ నయనతార దంపతులు మాత్రం న్యూ ఇయర్ కి ఘనంగా స్వాగతం పలకడంతో పాటుగా గ్రాండ్ గా  అయితే సెలబ్రేట్ చేసుకుంది. అందులో భాగంగానే చెన్నైలోని ప్రముఖ రైల్వే స్టేషన్ దగ్గరలో వీధి బాలలకు న్యూ ఇయర్ గిఫ్ట్ లను కూడా అందించిందట నయనతార.
భర్త విగ్నేష్ ఆమె ఇద్దరు కలిసి చెన్నైలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న పేద పిల్లలకు న్యూ ఇయర్ గిఫ్ట్ లను కూడా అందించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఆ వీడియోని చూసిన అభిమానులు నయనతార పై ప్రశంసలు వర్షం ను కురిపిస్తున్నారు. అందంతో పాటు నయనతారకు అంతకంటే అందమైన మనసు కూడా ఉంది అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇకపోతే నయనతార సినిమాల సంగతికి వస్తే ఇటీవల నయనతార నటించిన కనెక్ట్ సినిమా విడుదల అయ్యి మంచి విజయం ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: