మా అక్కతో దిల్ రాజ్ పెళ్లి.. పెద్ద టాస్క్ అన్న తరుణ్..!
ముఖ్యంగా తన బావగారు రెడ్డి సామాజిక వర్గానికి కలిగిన వ్యక్తి, కానీ తాము బ్రాహ్మణ్ ఫ్యామిలీ. మా అక్క ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థలో ఉద్యోగిగా పని చేసేది.ఆమె చదివింది మెడికల్ విభాగం, అయితే అనుకోకుండా ఎయిర్ లైన్స్ లో పనిచేసింది. ఆ సమయంలోనే తన బావ (దిల్ రాజు) తో పరిచయం ఏర్పడింది. తరచుగా విమాన ప్రయాణాలు చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య స్నేహంపెరిగిందని, అలా పెళ్లి వరకు తీసుకువెళ్లిందని తెలిపారు డాక్టర్ తరుణ్.
అయితే మొదట మా ఇంట్లో ఈ వివాహానికి ఒప్పుకోలేదు. ముఖ్యంగా మా అమ్మమ్మను ఒప్పించడం పెద్ద టాస్క్ గా మారింది. ఆమె పాతకాలం మనిషి కాబట్టి ఒప్పించడానికి చాలానే సమయం పట్టింది. అలా మా అక్క కోసమే తాము ముందడుగు వేసాము కానీ ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది అంటూ తెలిపారు. తన అక్కను మహారాణిలా తమ బావ చూసుకుంటున్నారని, ఆయన నోటి నుంచి ఎలాంటి తప్పుడు మాట రాదు, చివరికి తన దగ్గర పని చేసేవాళ్లను ఒక్క మాట మాట్లాడరు.. మా బావ బంగారం అని చెప్పారు డాక్టర్ తరుణ్. తన అక్క వివాహం ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నారనే విషయం అందులో నిజం లేదు. మా తండ్రి బిజినెస్ మ్యాన్ ,ఉద్యోగాలపరంగా (మా అమ్మ తమ్ముడు హైకోర్టులో ఉద్యోగం) నేను డాక్టర్, కుటుంబమంత బాగానే సంపాదిస్తున్నామని, అందుకే మేము అలాంటి విషయాలు పట్టించుకోలేదని తెలిపారు. కేవలం మా అక్క సంతోషంగా ఉండడమే మాకు కావాలి అని చెప్పుకొచ్చారు తరుణ్.