త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తా.. విజయ్ తో రిలేషన్ షిప్ గురించి బయటపెట్టిన రష్మీక..!?

Anilkumar
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్న లవ్ లో ఉన్నారనే వార్తలు ఎంతోకాలంగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. 'గీత గోవిందం' అనే సినిమాతో వెండితెరకి జంటగా కనిపించిన ఈ ఇద్దరు.. ఆ సినిమాలో తమ నటనతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. సినిమాలో వీళ్ళ మధ్య వచ్చే కెమిస్ట్రీ ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని.. ప్రేమించుకుంటున్నారు అనే వార్తలను ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. ఇక గీత గోవిందం తర్వాత మరోసారి వీళ్ళిద్దరూ కలిసి 'డియర్ కామ్రేడ్'  అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో కూడా అదే రేంజ్ లో కెమిస్ట్రీని పండిస్తూ ఏకంగా లిప్ లాక్ లతో కుర్రకారును టెంప్ట్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత విజయ్, రష్మిక ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు అనే వార్తలు కన్ఫర్మ్ అయిపోయాయి.

ఎందుకంటే వీళ్ళ కెమిస్ట్రీని చూసి జనాలు సైతం అదే ఫిక్స్ అయిపోయారు. కానీ మా మధ్య అలాంటిదేమీ లేదంటూ అటు విజయ్ దేవరకొండ ఇటు రష్మిక మందన ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నా.. సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అనే వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా మాల్దీవ్స్ కి వెళ్లిన విజయ్ దేవరకొండ అక్కడ చిల్ అవుతూ ఓ ఫోటోను షేర్ చేయడంతో.. ఆ ఫోటో కాస్త విజయ్, రష్మిక ల లవ్ ని మరోసారి కన్ఫామ్ చేసినట్లయింది. ఎందుకంటే రష్మిక మందన కూడా ఈ న్యూ ఇయర్ ని మాల్దీవ్స్ లోనే సెలెబ్రేట్ చేసుకుంది. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే తాజాగా ఓ మీడియాతో ముచ్చటించింది రష్మిక మందన. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.." విజయ్ నేను కలిస్తే చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. త్వరలోనే ఆ గుడ్ న్యూస్ మీకు చెప్తాం" అంటూ హింట్ ఇచ్చేసింది. దీంతో రష్మిక మందన, విజయ్ దేవరకొండ తో కలిసి సినిమాలో నటిస్తుందా? లేక జీవితాంతం రౌడీ హీరో తోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందా? అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ఇప్పుడు దీని గురించే చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: