"వాల్తేరు వీరయ్య" టీంకు చిరంజీవి పార్టీ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని మైత్రి మూవీ సంస్థ వారు నిర్మించ గా ... శృతి హాసన్ ఈ మూవీ లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించింది .

దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో తెరకెక్కిన ఈ మూవీ లో బాబి సింహ ఒక ముఖ్యమైన పాత్రలో నటించగా ... మాస్ మహారాజ రవితేజ ఈ మూవీ లో చాలా కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం జనవరి 13 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను ... కొన్ని పాటలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.
 

అలాగే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. న్యూ ఇయర్ సందర్భంగా వాల్తేరు వీరయ్య టీమ్ కు మెగాస్టార్ చిరంజీవి పార్టీ ఇచ్చాడు. అందుకు సంబంధించిన ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన న్యూ ఇయర్ పార్టీలో దర్శకుడు బాబి ... హీరో రవితేజ ... శేఖర్ మాస్టర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: