ఇప్పటికీ ఆర్ఆర్ఆర్ క్రేజ్ తగ్గనట్టేనా? ఇది తెలిస్తే షాక్..!

Divya
2022 మార్చి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం ఆర్.ఆర్.ఆర్. స్వాతంత్ర పోరాటంలో భాగంగా హిందూ ముస్లిం స్నేహితుల కలయిక బ్రిటిష్ వారిపై ఎలా యుద్ధం చేశారు అనే సారాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం యావత్ ప్రపంచ స్థాయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్ , ఎన్టీఆర్ కి పూర్తిస్థాయిలో క్రేజ్ లభించడం గమనార్హం. అంతేకాదు ఈ స్టార్ హీరోలు ఇద్దరికీ కూడా ప్రపంచ స్థాయిలో అభిమానులు ఉన్నారు అనడంలో సందేహం లేదు. కేవలం ఈ ఒక్క సినిమాతోనే వీరు తమ పాపులారిటీని వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకునేలా చేసుకోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పాలి.
అయితే రాజమౌళి పట్టు విడవని విక్రమార్కుడి లాగా .. తన ఆర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్ లెవెల్ లో తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాడు.  అందులో భాగంగానే  జపాన్ వంటి ప్రాంతాలలో కూడా సినిమాను రిలీజ్ చేస్తూ పాపులారిటీ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇకపోతే ఒక సినిమా విడుదలైన తర్వాత ఒక రెండు లేదా మూడు నెలలు మాత్రమే క్రేజ్ ఉంటుంది.  కానీ ఈ సినిమాకి మాత్రం విడుదల అయ్యి ఏడాది కావస్తున్నా క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.  ముఖ్యంగా ఈ సినిమా నుంచి వచ్చిన ..  ఇప్పుడు మరొక అప్డేట్ తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే..

జనవరి 10వ తేదీన అనగా మంగళవారం యూఎస్ఏ లో జరగనున్న  గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ కి ఆర్.ఆర్.ఆర్. టీమ్ హాజరుకానున్నారు. జనవరి 9వ తేదీన లాస్ ఏంజెల్స్ లోని టి సి ఎల్ చైనీస్ థియేటర్లో ప్రత్యేక ప్రదర్శన కూడా ఇవ్వబడుతుంది ఈ చిత్రం. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా ఏ రేంజ్ లో విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల మన్ననలను పొందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: