ఆ స్టార్ హీరోతో మళ్ళీ నటించాలని ఉందంటోన్న త్రిష..?

Anilkumar
సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు ఫలానా హీరోతో హీరోయిన్ తో నటించాలని ఉందంటూ సందర్భాన్ని బట్టి తమ మనసులో కోరికను బయట పెడుతూ ఉంటారు. అయితే కొందరు కొంతమంది స్టార్ హీరోలతో నటించాలని ఉందని చెబుతుంటే మరి కొందరు యంగ్ హీరోలతో నటించాలని ఉందని అంటుంటారు. హీరోయిన్లు ఎక్కువగా అగ్ర హీరోలతో నటించాలని ఉందంటూ చెప్తుంటారు. ఈ క్రమంలోని మన చెన్నై బ్యూటీ త్రిష ఓ స్టార్ హీరోతో కలిసి నటించాలని ఉన్నట్లు తాజాగా పేర్కొంది. అంతేకాదు ఆ స్టార్ హీరో తో నటించడం తన జీవితంలోని గొప్ప విషయం అని చెప్పుకొచ్చింది.

 ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అనేది తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.. త్రిష తాజాగా నటించిన రాంగి అనే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష తన మనసులో మాటను వెల్లడించింది. ఇక ప్రస్తుతం త్రిష సౌత్ మూవీస్ లో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. తనతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది హీరోయిన్లు ఎప్పుడో కనుమరుగైపోయారు. కానీ త్రిష మాత్రం తన తరగని అందం అభినయంతో మంచి అవకాశాలు దక్కించుకుంటుంది. ఇటీవలే పొన్నియన్ సెల్వం సినిమాతో పాన్ ఇండియా హిట్  అందుకుంది.

ఈ సినిమాలో కుంద వై పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచి  మంచి ప్రశంసలు అందుకుంది. ఇక తాజాగా రాంగి అనే సినిమా కోసం త్రిష ఎంతో కష్టపడింది. ఈ సినిమాలో డూప్ లేకుండానే ఆమె ఫైట్ చేసి యాక్షన్స్ సన్నివేశాల్లో దుమ్మురేపింది. తాజాగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక ఈ క్రమంలోని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష ఇన్ని సంవత్సరాల తన సినిమా ప్రయాణంలో ఓ కోరిక అలాగే మిగిలిపోయింది అని తెలిపింది.అదే సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటించాలని ఉందని చెబుతూ మనసులో మాటను బయటపెట్టింది. అయితే గతంలో రజనీకాంత్ హీరోగా నటించిన పేట అనే సినిమాలో నటించింది త్రిష. అయినప్పటికీ మరోసారి రజనీకాంత్ గారితోనే నటించాలని ఉందని త్రిష చెప్పడం గమనార్హం. ఇక పొన్ని యన్ సెల్వం పార్ట్ 2 కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపిన త్రిష. రజనీకాంత్ తో మరోసారి కలిసిన నటించాలని కోరిక త్వరలో నెరవేరుతుందని తన ఆశాభావాన్ని వ్యక్తపరిచింది. దీంతో త్రిష చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: