ఏంటి.. హీరో రామ్.. ఇన్ని సినిమాలు వదులుకున్నాడా?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమంలో ఉన్న యువ హీరోలు అందరిలో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. నిర్మాత స్రవంతి రవి కిషోర్ తమ్ముని కొడుకుగా సినిమాల్లోకి హీరోగా పరిచయమైన రామ్ చిన్న వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఇక మొదటి సినిమాతోనే తన టాలెంట్ ఏంటో నిరూపించుకుని ప్రేక్షకులు అందరూ చూపును తన వైపుకు తిప్పుకున్నాడు.

 వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన దేవదాసు సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా సమయానికి రామ్ వయస్సు కేవలం 17 ఏళ్లు మాత్రమే కావడం గమనార్హం. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి 14 ఏళ్ళు గడుస్తుంది. అయితే ఈ 14 ఏళ్లలో ఎన్నో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టు కూడా అందుకున్నాడు. ఇక ఇప్పటివరకు మాస్ కమర్షియల్ సినిమాల జోలికి పోకుండా లవ్ అండ్ ఎంటర్టైనర్ జానెర్ లోనే నెట్టుకొస్తున్నాడు అన్న ట్రోల్స్ కూడా అప్పుడప్పుడు రామ్ పై వస్తూ ఉంటాయి.

 ఇలాంటి సమయంలోనే పూరి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన ఇష్మార్ట్ శంకర్ సినిమాతో ఫుల్ మాస్ రోల్ లో నటించి బ్లాక్ బస్టర్ సాధించాడు రామ్. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం ఒక సాలిడ్ హిట్టు కోసం మళ్లీ వేచి చూస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే రామ్ తన కెరియర్ లో ఇప్పటి వరకు సినిమాలు వదులుకున్నాడు అన్నది తెలుస్తుంది. ఆ లిస్టు చూసుకుంటే..
 గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాని సమంత జంటగా తెరకెక్కిన ఎటో వెళ్లిపోయింది మనసు సినిమా స్టోరీ ముందుగా రామ్ కు వినిపించాడట. కానీ కథ నచ్చక వదులుకున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన రభస సినిమాను కూడా రామ్ వదులుకున్నాడట. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన రాజా ది గ్రేట్ సినిమాను కూడా ముందుగా రామ్ వినిపించుగా అతను రిజెక్ట్ చేయడంతో ఇక రవితేజ చేసి హిట్టు కొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: