ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన రిలీజ్ డేట్..!

shami
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన నెక్స్ట్ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ట్రిపుల్ ఆర్ తర్వాత ఓ పక్క చరణ్ మెరుపు వేగంతో సినిమాలు చేస్తుంటే తారక్ మాత్రం తన నెక్స్ట్ సినిమాని ఇంతవరకు మొదలు పెట్టలేదు. కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా కథని ముందు తెలుగు మార్కెట్ వరకే అనుకోగా ఆర్.ఆర్.ఆర్ తర్వాత దాన్ని పాన్ ఇండియా కథగా మార్చారు. ఆ మార్పుల కోసం చాలా టైం తీసుకున్నారు.
ఇక 2022 లో సినిమా మొదలవుతుంది అనుకున్న ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లేశారు. ఈ ఏడాది సంక్రాంతి తర్వాత ఈ సినిమా మొదలు పెడతారని తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా ఎన్.టి.ఆర్ 30వ సినిమా నుంచి రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ సినిమాని ఏకంగా 2024 సమ్మర్ కి వాయిదా వేశారు. ఈ రిలీజ్ డేట్ నందమూరి ఫ్యాన్స్ కి పెద్ద షాక్ ఇచ్చింది. అంటే ఎన్.టి.ఆర్ సినిమా 2023 లో వచ్చే ఛాన్స్ లేదని క్లారిటీ వచ్చింది.
2022 సెకండ్ హాఫ్ లో మొదలై ఉంటే మాత్రం ఈ ఏడాది చివరి కల్లా అయినా ఎన్.టి.ఆర్ సినిమా వచ్చి ఉండేది కానీ అలా జరగలేదు. కొరటాల శివ ఇంకా ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూట్ కి వెళ్లనున్న ఎన్.టి.ఆర్ 30వ సినిమా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ రిలీజ్ డేట్ విషయంపై నందమూరి ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ ఏడాది మొత్తం తమ హీరో సినిమా చూడకుండా అవుతుందని బాధపడుతున్నారు. కొరటాల శివతో ఆల్రెడీ తారక్ జనతా గ్యారేజ్ సినిమా చేశాడు. ఆ సినిమా తర్వాత ఈ కాంబోపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్.టి.ఆర్ 30వ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. సినిమాకు కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: