#NBK 108 మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన బాలయ్య..!

Divya
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలకృష్ణను ఒక డిఫరెంట్ యాంగిల్ లో ప్రజెంట్ చేస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే డిసెంబర్ 8వ తేదీన ఈ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అనిల్ రావిపూడి ప్లానింగ్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఆ ప్లానింగ్ ప్రకారం ఎన్.బి.కె 108 ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. ఈ షెడ్యూల్లో ఒక భారీ ఫైట్ ను చిత్రీకరించినట్లుగా అనిల్ రావిపూడి మీడియాతో వెల్లడించారు.
ఇకపోతే అనుకున్న ప్లానింగ్ ప్రకారం మొదటి షెడ్యూల్లో 2022 చివరి రోజున పూర్తి చేయడంపై ఎంటైర్ టీం హ్యాపీగా ఫీల్ అయింది. బాలకృష్ణ , నిర్మాతలు దర్శకుడు అనిల్ రావిపూడి అందరూ కలిసి కేక్ కట్ చేశారు. ఇదే స్పీడ్ తో వెళ్తే బాలకృష్ణ ఎన్.బి.కె 108 సినిమాలు ఈ ఏడాది మే నాటికంతా విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. బాలకృష్ణ సరసన ప్రియాంక జవాల్కర్ ర్ హీరోయిన్గా నటించగా.. బాలయ్య కుమార్తెగా శ్రీ లీలా కనిపిస్తుందని చెబుతున్నారు.  ఇకపోతే బాలకృష్ణ తన 107వ చిత్రంలో కూడా మరొకవైపు బిజీగా ఉన్నారు..
ఇకపోతే ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. జనవరి 12వ తేదీన సంక్రాంతి పండుగ కానుక గా సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అంతేకాదు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్  ఒంగోలులో జనవరి 6వ తేదీన చాలా ఘనంగా నిర్వహించబోతున్నట్లు సమాచారం.అంతేకాదు ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాలలో బిజీగా ఉంటూనే.. మరొకవైపు ఇలా స్టార్ హీరోల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకి కూడా ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: