అప్పులు తీర్చడానికి అలాంటి పని చేసిన ప్రభాస్..!?

Anilkumar
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందడు ప్రభాస్. ఈ సినిమాతో ఇండియా వైడ్ గా భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు ఈయన. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు ప్రభాస్. అయితే ప్రస్తుతం ఈయన హీరోగా నటిస్తున్న ఒక్క సినిమాకి గాను దాదాపు 100 కోట్లకు పైగానే పారితోషికం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ప్రభాస్ నటించిన ప్రతి సినిమా కూడా 1000 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇలాంటి స్టార్ హీరో ఒకప్పుడు ఆయన అప్పులు తీర్చడానికి కూడా ఒక సినిమాను చేసి నట్లుగా తెలుస్తోంది. 

అయితే తాజాగా ప్రభాస్ నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 లో ప్రభాస్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఎపిసోడ్ ఇటీవల విడుదల కావడం జరిగింది. ఇక ఈ షోలో భాగంగా ప్రభాస్ సినిమాలు ,పెళ్లి, హీరోయిన్లతో రిలేషన్షిప్ ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. అయితే ఈ క్రమంలోని ప్రభాస్ అప్పులు తీర్చడానికి రెబల్ సినిమా చేశానంటూ ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు. ఇక ఆయన మాట్లాడుతూ మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత బాహుబలి సినిమా చేసేందుకు ఒప్పుకున్నాను..

అప్పటికి నాకు చాలా అప్పులు ఉన్నాయి.. ఆ సమయంలోనే రెబల్ సినిమా నా దగ్గరకు రావడం జరిగింది.. రాజమౌళి మాత్రం బాహుబలి సినిమాకి ఇంకా టైం పడుతుంది అనడంతో ఈ గ్యాప్ లో నాకున్న అప్పులు తీర్చడానికి రెబల్ సినిమాను చేశాను.. అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్. దాని అనంతరం బాహుబలి సినిమా సమయం అప్పుడు మిర్చి సినిమా తీయాలి అని అనుకున్నాం.. ఆ సమయంలో రాజమౌళి గారి పర్మిషన్ను తీసుకుని రెబెల్ సినిమాను చేశాను.. దాని అనంతరం మిర్చి సినిమాకి మళ్ళీ రాజమౌళి ఒప్పుకుంటారా లేదా అన్న కన్ఫ్యూషన్ లో ఉన్నప్పుడు రమ గారు ప్రభాస్ కి ఎలాగో లేటవుతుంది.. మిర్చి సినిమా చేసే అని చెప్పారు.. దీంతో బాహుబలి సినిమా ఒప్పుకున్న తరువాత రెబల్ మరియు మిర్చి సినిమాలను చేశాను.. అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్.రెబల్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ మిర్చి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దీంతో ప్రభాస్ అప్పుల తీర్చడానికి గాను రెబల్ సినిమా చేయడం చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: