జబర్దస్త్ లో.. కమెడియన్ రాకెట్ రాఘవ అరుదైన రికార్డ్?

praveen
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం బుల్లితెరపై ఎంత సెన్సేషన్  సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని షోల లాగానే   ఒక సాదాసీదా కామెడీ షో గా ప్రారంభమైన జబర్దస్త్ కార్యక్రమం సరికొత్త కామెడీ తో నవ్వుల సునామీ సృష్టించింది అని చెప్పాలి  ఇక ఆ తర్వాత జబర్దస్త్కు పోటీ ఇచ్చేందుకు ఎన్ని షోలు వచ్చినా ఎక్కడ నిలబడి పోటీ ఇవ్వలేకపోయాయి. దాదాపు దశాబ్ద కాలం నుంచి కూడా సక్సెస్ఫుల్ షో గా కొనసాగుతున్న జబర్దస్త్ ఇప్పటికీ సరికొత్తగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంది.

 ప్రేక్షకులను నవ్వించడమే కాదు ఇక ఇండస్ట్రీలోకి రావాలనుకునే ఎంతోమంది కమెడియన్స్ కి సరికొత్త జీవితాన్ని ప్రసాదించింది. కష్టాల్లో ఉన్న వారికి ఫైనాన్షియల్ గా భద్రత కల్పించింది. అంతేకాదు ఎంతో మందిని స్టార్లను కూడా చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక 2023 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న జబర్దస్త్ కార్యక్రమం ఒక అరుదైన మైలురాయిని అందుకుంది. ఏకంగా 500 ఎపిసోడ్ కు చేరుకుంది జబర్దస్త్ కార్యక్రమం. ఈ క్రమంలోనే జనవరి 5వ తేదీన ఈ 500 ఎపిసోడ్ ప్రారంభం కాబోతుండగా జబర్దస్త్ మాజీ జడ్జి రోజా ను మళ్ళీ స్పెషల్ గెస్ట్ గా పిలిపించి సందడి చేయించారు నిర్వాహకులు.

 ఇక ఇటీవలే జబర్దస్త్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని సోషల్ మీడియాలో విడుదల చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. అయితే ఇక జబర్దస్త్ 500 ఎపిసోడ్ కు చేరుకున్న నేపథ్యంలో అటు కమెడియన్ గా ఉన్న రాకెట్ రాఘవ సైతం ఒక అరుదైన రికార్డును సృష్టించాడు అని చెప్పాలి. జబర్దస్త్ షో మొదలైన నాటి నుంచి ఒక్క ఎపిసోడ్ కి కూడా బ్రేక్ తీసుకోకుండా రాకెట్ రాఘవ షోకి అందుబాటులో ఉన్నాడు. దీంతో జబర్దస్త్ తో పాటే రాఘవ కూడా 500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నాడు. దీంతో జబర్దస్త్ జడ్జి రోజా చేతుల మీదుగా రాకెట్ రాఘవకి ఒక ప్రత్యేకమైన సన్మానం చేయడం ఇటీవల విడుదలైన ప్రోమోలో చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: