శ్రీ దేవి కూతురుకి ఆ తెలుగు హీరోలంటే చాలా ఇష్టమట..?

Divya
టాలీవుడ్ లో ఒకప్పటి అందాల తార శ్రీదేవి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అప్పట్లో ఎంతో మంది హీరోలందరితో కలిసి నటించినది. అంతేకాకుండా శ్రీదేవి తెలుగులో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇది కాస్త పక్కన పెడితే శ్రీదేవి వారసురాలుగా జాన్వీ కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి రావాలని కోరిక శ్రీదేవికి ఉండేదట.ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది. జాన్వి ఇక ఈమె బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియాలో కూడా నటించాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే జాన్వీ కూడా సౌత్ ఇండియాలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని తెలియజేసింది. జాన్వీ సినిమాలో బిజీగా ఉంటోంది కానీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటోంది.. అంతేకాకుండా ఆమెకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా సరే తెలియజేస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. గతంలో తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ తో నటించాలనే కోరిక ఉండేదట. తాజాగా ఆయన నటించిన ఆర్. ఆర్. ఆర్ సినిమాను చూసి ఆ సినిమా ద్వారా తన అభిమానిగా మారిపోయానని ఎన్టీఆర్ చాలా అద్భుతమైన నటుడని తన సినిమాలను చూసి తను  కూడ వీర అభిమానిగా మారిపోయానని జాన్వీ చెప్పుకొచ్చింది.
ఒకవేళ టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశం వస్తే జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా నటించాలని ఉంది.వీరిద్దరితో పాటు మహేష్ కూడా తన క్రష్ అని తెలియజేస్తోంది. తన మనసులో కోరికను బయటపెట్టింది జాన్వీ  అయితే జాన్వీ కి  వీరందరి సరసన నటించే అవకాశాలు వస్తాయో లేదో చూడాలి మరి. జాన్వీ హిందీ భాషలో చాలా సినిమాలలో నటించిన పర్వాలేదు అనిపించుకుంటోంది. అయితే టాలీవుడ్ లో కూడా నటించి తన తల్లి లాగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుందో లేదో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: