బిగ్ బాస్ బ్యూటీ గీతూ రాయల్.. పాలిటిక్స్ లోకి రాబోతుందా?

praveen
సోషల్ మీడియా చిచ్చర పిడుగుగా  ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న గీతూ రాయల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకం గా పరిచయం అక్కరలేదు అని చెప్పాలి. మొన్నటి వరకు సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించినప్పుడు కొంత మందికే తెలుసేమో.. కానీ ఇక బిగ్ బాస్ ఆరవ సీజన్లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మాత్రం తెలుగు ప్రజలందరికీ కూడా సుపరిచితురాలుగా మారి పోయింది ఈ అమ్మాయి. ఏకంగా బిగ్ బాస్ హౌస్ లో తనదైన శైలిలో ఎంటర్టైన్మెంట్ మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్గా గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమం లోనే గీతు టాప్ ఫైవ్ లో తప్పకుండా ఉంటుందని అందరూ అనుకున్నారు.

 కానీ బాలాదిత్యతో జరిగిన సిగరెట్ గొడవ కారణం గా చివరికి గీత ఇమేజ్ మొత్తం పాడైంది. దీంతో ఓట్లు ఒక్కసారిగా ఓట్లు తగ్గిపోవడంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు సంపాదించుకున్న గీతూ కాస్త చివరికి మధ్యలోనే ఎలిమినేట్ కావలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఎలిమినేట్ అయిన సమయంలో కూడా తాను బిగ్ బాస్ వదిలిపోను అంటూ చిన్న పిల్లల ఏడవడంతో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.  ఇకపోతే గీత రాయల్ కి సంబంధించిన ఒక వార్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

 ఏకంగా తాను రాజకీయాల్లో చేరబోతున్నాను అంటూ ఈ బిగ్ బాస్ బ్యూటీ చెప్పడం అందరిని అవాక్కయ్యేలా చేసింది. తనకు రాజకీయాలంటే ఆసక్తి ఉందని.. ఖచ్చితంగా త్వరలోనే ఒక రాజకీయ పార్టీలో చేరుతానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికైతే ఇక రాజకీయాలను ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని.. త్వరలోనే ఒక నిర్ణయాన్ని తీసుకొని  ఏ పార్టీలో చేరబోతున్నాను అన్న విషయాన్ని త్వరలోనే చెబుతాను అంటూ చెప్పింది. ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న తప్ప పదవుల కోసం కాదని చెప్పింది గీతూ రాయల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: