ప్రభాస్ జాతకం గురించి సంచలన విషయాలను బయటపెట్టిన వేణు స్వామి..!?

Anilkumar
సినీ సెలబ్రిటీల జాతకాలను చెబుతూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారే వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈయన ఇటీవల విజయ్ దేవరకొండ రష్మిక మందన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. వారితో పాటు సమంత వివాహ జీవితం గురించి.. రాంచరణ్ మరియు ఉపాసన సంతానం గురించి ...కూడా ఆయన 8 ఏళ్ల క్రితమే చెప్పడం జరిగింది. ఇక ఈయన చెప్పినవన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటి జరుగుకుంటూ వస్తున్నాయి. ఆయన చెప్పిన సమయంలో ఈయన మాటలను ఎవరు నమ్మరు.

కానీ కొంతకాలం తర్వాత ఆయన చెప్పిన మాటలే నిజమవుతాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన ప్రభాస్ ఆరోగ్యం గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేయడం జరిగింది. ఇందులో భాగంగా యాంకర్ వేణు స్వామిని ప్రభాస్ జాతకంలో ఏముంది? ఆయన జాతకం ఎలా ఉంది?అని ప్రశ్నించింది. ఇక దానికి ఎవరు ఊహించిన విధంగా సమాధానాన్ని చెప్పాడు. ప్రభాస్ జీవితంలో ఆయన చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని.. దాంతోపాటు సినీ పరిశ్రమ లో కూడా అనేకమైన ఇబ్బందులు ఆయనకు ఎదురవుతాయని..

ప్రభాస్ జాతకం  ఇబ్బందికరంగా ఉంది అని.. త్వరలోనే ఆయన జీవితంలో ఒక పెద్ద సమస్యను ఆయన ఎదుర్కోవాల్సి వస్తుందని.. అది ఎప్పుడు వస్తుందో తెలియదు గానీ ..దానికి ఆయన సిద్ధంగా ఉండాలి అని.. చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఆయన జాతకాలను నమ్మడని..అందుకే ఆయన జాతకాల నేపద్యంలో తెరకెక్కించిన పరాధే శ్యామ్ సినిమా ఫ్లాప్ అయిందని.. అయన చెప్పుకొచ్చాడు. ఇప్పటికైనా దేవుళ్ళని నమ్మాలని.. లేకపోతే ఇంకా ఇబ్బందుల పాలవుతాడని ఆయన చెప్పుకొచ్చాడు. ప్రభాస్ కి వచ్చే సమస్యల వల్ల ఆయనతో పాటు ఆయన కుటుంబం కూడా అనేక ఇబ్బందులకు గురవుతుందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు. 2023 నుండి అత్యంత దారుణమైన పరిస్థితులను ప్రభాస్ ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన చెప్పుకోచాడు. దీంతో ఈ వార్తలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: