పెళ్ళి గురించి డార్లింగ్ ఏమన్నాడంటే?

Satvika
తెలుగులో కొత్త కొత్త షోలకు కొదవ లేదు..ఇప్పుడు అందరి నోట ఒకటే మాట వినిపిస్తోంది..అదే బాలయ్య షో అన్ స్టాపబుల్ 2.. స్టార్ హీరోలతో ఆయన చేసే సరదాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దాంతో జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్-2 క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫేమస్ సెలబ్రీటీలు హాజరవుతున్న ఈ షో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది..బాలయ్య వేసే ప్రశ్నలకు సెలెబ్రేటీలు ఎటువంటి సమాధానాలు చెబుతారో అని..ఇలా ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచనతో షో కు రేటింగ్ బాగా పెరిగిపోయింది..మొదటి సీజన్ సక్సెస్ అవ్వడం తో ఇప్పుడు రెండో సీజన్ ను మొదలు పెట్టారు..

ఈ రెండో సీజన్ లో స్టార్ హీరోలు అందరు వచ్చారు..అందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ హైలెట్ అయ్యింది..ఈ సీజన్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్, గోపీచంద్‌తో కలిసి ఈనెల 30న ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమో రిలీజైంది. అయితే ఈ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా ప్రసారం చేయనుండగా తాజాగా మరో అదిరిపోయే ప్రోమోతో ఆహా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది..

ఈ ప్రోమోలో ప్రభాస్‌ను బాలకృష్ణ సరదా ప్రశ్నలతో ముంచెత్తారు. ఈ ప్రోమో చూస్తే ఆద్యంతం నవ్వుల పూయించడం ఖాయంగా కనిపిస‍్తోంది. ఇందులో సెటైర్లు, సీక్రెట్స్, సరదాలు, సలహాలు, డ‍్యాన్సులు, సంచలనాలు, అన్ని ఉండనున్నట్లు ఆహా సోషల్ మీడియాలో వెల్లడించింది. దీంతో ఈ ఎపిసోడ్ కోసం ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈనెల 30న మొదటి పార్ట్ ప్రసారం కానుండగా.. జనవరి 6న రెండో పార్ట్ ప్రసారం చేయనున్నట్లు ఆహా ప్రకటించింది...న్యూ ఇయర్ స్పెషల్ 31 డిసెంబర్ న ఈ ఎపిసోడ్ ప్రసారం కాబోతుంది. ప్రభాస్ కు సంబందించిన చిన్న వీడియో గ్లిమ్ప్స్ ఇప్పటికే నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఇదే ఈ షోకు మరింత హైప్ పెంచింది అనుకుంటే ఇప్పుడు ఈ సీజన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాక మరింత ఉత్సాహాన్ని క్రియేట్ చేస్తుంది.పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఎపిసోడ్ నిన్న అన్నపూర్ణ స్టూడియోలో షూట్ చేసారు.. మరి ఈ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా ప్రసారం అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: