ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్..?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ నూ తన ఖాతాలో వేసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాతో ఆయనకు పాన్ ఇండియా క్రేజ్ కూడా దక్కింది.త్రిబుల్ ఆర్ సినిమా అనంతరం జూనియర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివ తో తెరకెక్కించడానికి రెడీ అయిన సంగతి మనందరికీ తెలిసిందే.ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. 

ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జనవరి నుండి మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ కే.జి.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీళ్లతో కూడా ఒక సినిమా చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని గతేడాది అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. ఇక దీనికి గాను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్తలు వస్తూనే ఉంటాయి. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా నటిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాలో చాలామంది స్టార్ హీరోల పేర్లు సైతం వచ్చాయి.

అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఇండియన్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా నటిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికీ దీనికి సంబంధించి నిర్మాతలు కూడా ఆమిర్ ఖాన్ ను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయం ఎంతవరకు నిజమో కాదో తెలియదు గాని జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చిత్ర బృందం చెప్పేవరకు ఈ వార్తల్లో నిజం ఉంది అని నమ్మడం కష్టమే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: