ఆ సినిమా సీక్వెల్ తో మాస్ రాజా వారసుడి ఎంట్రీ.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!

Anilkumar
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులుగా ఎంట్రీ ఇచ్చి హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకుంటూ ఉంటారు. మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే పదుల సంఖ్యలో వారసులు వచ్చారు. అలాగే నందమూరి ఫ్యామిలీ నుండి కూడా చాలామంది హీరోలుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. వారితో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ నుండి కూడా ఇద్దరు ముగ్గురు హీరోలు ఉన్నారు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున తో కలిసి అందరూ హీరోలుగా చలామణి అవుతున్నారు. ప్రస్తుతం యావత్ సినీ ఇండస్ట్రీ మొత్తం నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే బాలకృష్ణ వారసుడు కోసమే కాకుండా టాలీవుడ్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు పొందిన మాస్ మహారాజా రవితేజ ఫ్యామిలీ నుండి కూడా ఒక వారసుడు హీరోగా ఎంట్రీ వస్తే బాగుంటుంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ విషయానికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మాస్ మహారాజ రవితేజ కొడుకు ఇడియట్ 2 సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు అన్న వార్తలు తెగ వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై స్పందించాడు మాస్ మహారాజ రవితేజ. తాజాగా జరిగిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రెస్ మీట్ లో భాగంగా రవితేజ స్పందించాడు.

ఇందులో భాగంగానే ఒక విలేఖరి మీ అబ్బాయిని ఇడియట్ 2 సినిమాతో పరిచయం చేయడానికి మీరు రెడీగా ఉన్నారా అంటూ అడగడం జరిగింది.ఇక దానికి రవితేజ... అదేమీ లేదని వినడానికి ఇది చాలా కొత్తగా ఉందని చెప్పుకు వచ్చాడు.. దాని అనంతరం మైత్రి నిర్మాత రవిశంకర్ తను చాలా చిన్నవాడని ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఏవి లేవని చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి రవితేజ వారసుడి ఎంట్రీ కి ఇంకా చాలా టైం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రవితేజ గతంలో నటించిన రాజా ది గ్రేట్ సినిమాలో ఆయన కొడుకు చిన్ననాటి మాస్ మహారాజా క్యారెక్టర్లో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: