మెగాస్టార్ సంచలన ప్రకటన.. రెండేళ్ల తర్వాత పవన్ తో సినిమా..?

Anilkumar
ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి వంటి సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి తను నటిస్తున్న సినిమాలలో మరో స్టార్  హీరోతో జతకడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే
 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు మెగాస్టార్ చిరంజీవి కలిసి నటించిన ఆచార్య సినిమాలో ఆయన తనయుడు రామ్ చరణ్ ఒక ముఖ్య  పాత్రలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో మంచి విజయాన్ని అందుకోలేకపోయింది. దాని అనంతరం మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో సత్యదేవ్ మరియు సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలు కీలకపాత్రలో నటించడం జరిగింది. 

అయితే ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవితో పాటు మరొక స్టార్ హీరో అయిన మాస్ మహారాజ రవితేజ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి నటించిన గత రెండు సినిమాల లాగా కాకుండా బ్లాక్ బస్టర్ హిట్ను ఈ సినిమా అందుకుంటుంది అన్న నమ్మకంతో ఉన్నారు. ఇక దీనికి సంబంధించి తాజాగా ఒక ప్రెస్ మీట్ను కూడా ఏర్పాటు చేశారు చిత్ర బృందం. అయితే ఈ ప్రెస్ మీట్ లో భాగంగా ఒక విలేకరి మెగాస్టార్ చిరంజీవిని... చాలామంది స్టార్ హీరోలతో మీరు నటించారు.. కానీ మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ తో మాత్రం ఇప్పటివరకు ఒకే స్క్రీన్ పై కనిపించలేదు..

మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ తో ఎప్పుడు నటిస్తారు అని అడగగా.. పవన్ కళ్యాణ్ ఒప్పుకొన్న సినిమాలు ఇప్పటికే చాలా ఉన్నాయి... ముందు అవన్నీ పూర్తి అవ్వాలి ..ఇక వాటికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. ఆ సినిమాలు అన్నీ పవన్ పూర్తి చేసుకున్న అనంతరం దీని గురించి ఆలోచిస్తాం... అంటూ సమాధానమిచ్చాడు చిరంజీవి. ఇక వీరిద్దరిని ఒకే స్క్రీన్ పైన చూడడానికి మెగా అభిమానులే కాకుండా సినీ ప్రేక్షకులు ఎందరో ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటికీ వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా కూడా రాలేదు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఒక సినిమా వస్తే బాగుంటుంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: