శ్రీదేవి... చిరంజీవి సాంగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన మాస్టర్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ డాన్స్ కొరియో గ్రాఫర్ లలో ఒకరు అయినటువంటి శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శేఖర్ మాస్టర్ ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు డాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ డాన్స్ కొరియోగ్రాఫర్ లలో ఒకరిగా కొనసాగుతున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా శేఖర్ మాస్టర్ ... మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ లోని శ్రీదేవి ... చిరంజీవి అనే సాంగ్ కు కొరియోగ్రఫీ చేశాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సాంగ్ లిరికల్ వీడియోను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. తాజాగా శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. శ్రీదేవి ... చిరంజీవి సాంగ్ కోసం విదేశాలకు వెళ్ళాం.

ఈ సాంగ్ కోసం మేము అక్కడ మైనస్ 10 డిగ్రీస్ సెంటీగ్రేట్ వద్ద పని చేశాం. థర్మల్ లు ... జర్కిన్ లు ... బూట్లు మొదలైన వాటిని ధరించినప్పుడు మరియు నడుస్తున్నప్పుడు కాళ్లు స్తంభించిపోతాయి ... కానీ అలాంటి చలిలో కూడా చిరంజీవి మరియు శృతి హాసన్ ఈ సాంగ్ కోసం చాలా కష్టపడ్డారు. అలాగే ఈ సాంగ్ లో అద్భుతమైన డ్యాన్ లు కూడా చేశారు అని తాజాగా శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి బాబి దర్శకత్వం వహించగా ... movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించగా ... రవితేజ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: