బాలయ్య - నాగ్ కాంబినేషన్లో సినిమా ఎందుకు ఆగిపోయింది..?

Anilkumar
సినీ ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం సాధారణం. ఇక అలా తమ అభిమాన హీరోలు ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తున్నారు అంటే వారి అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. ఇక అలా సీనియర్ ఎన్టీఆర్ మరియు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన సినిమాల గురించి మనందరికీ తెలిసిందే. ఇక అప్పట్లో వీరిద్దరి మధ్య పోటీ కూడా చాలా ఎక్కువగా ఉండేది. వీరిద్దరూ అలా పోటీ పోటీగా సినిమాలు చేసినందుకుగాను ఇండస్ట్రీకి లాభమే జరిగింది. సీనియర్ ఎన్టీఆర్ మరియు అక్కినేని నాగేశ్వరరావు కలిసి దాదాపుగా 14 సినిమాలలో నటించారు. 

వారి నటనకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఇద్దరు ఒకే స్క్రీన్ పై కనిపించినప్పటికీ ఒకరిని మించేలా ఒకరి నటన ఉండేది. ఇక వారిద్దరి వారసులుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ మరియు అక్కినేని నాగార్జున నువ్వు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా చలామణి అవుతున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో కూడా సినిమాలు చూడాలని వీరిద్దరి అభిమానులు ఎప్పటినుండో కోరుకుంటున్నారు. నాగార్జునకి సాధారణంగా ఎన్టీఆర్ కుటుంబం పట్ల అమితమైన గౌరవం ఉంటుంది. దీనికిగాను గతంలో నాగార్జున నందమూరి హరికృష్ణతో కలిసి సీతారామరాజు సినిమాలో కలిసి నటించిన సంగతి చాలామందికి తెలిసి ఉంటుంది.

దాని అనంతరం బాలయ్య మరియు నాగార్జునలతో కలిసి గుండమ్మ అనే సినిమాను తెరకెక్కించాలని భావించారు కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. అయినప్పటికీ బాలకృష్ణ మరియు నాగార్జున కి కలిసి నటించిన కోరిక ఎక్కువగా ఉండేది. 2011లో వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించాలని అనుకున్నారు. గతంలో వచ్చిన క్రిస్టియన్ బ్రదర్స్ సినిమా తెలుగు రైట్స్ ను బెల్లంకొండ సురేష్ కొనడం జరిగింది. ఇక ఆ సినిమాలో బాలకృష్ణను మరియు నాగులను ఒకే స్క్రీన్ పై చూపించాలని అనుకున్నారు. దీనికి నాగార్జున మరియు బాలకృష్ణ సైతం ఒప్పుకున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల ఈ ప్రాజెక్టు అక్కడితోనే ఆగిపోయింది. దాని అనంతరం ఎన్నో సినిమాలలో వీరిద్దరూ కలిసి నటించాలి అనుకున్నారు అయినప్పటికీ వీరు అనుకున్నది మాత్రం ఇప్పటివరకు జరగలేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: