ఆ స్టార్ హీరోయిన్ బాటలో అనుష్క..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ అందరిని మెప్పించిన అనుష్క గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే గతంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న అనుష్క ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై కనిపించి దాదాపు రెండేళ్లు గడుస్తోంది. భాగమతి సినిమా తర్వాత ఆమె నటించిన ఏ సినిమా కూడా థియేటర్లో రిలీజ్ కాలేదు. కరోనా సమయంలో అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా ఓటీటిలో రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా అనంతరం అనుష్క రెండేళ్ల గ్యాప్ ను తీసుకుంది. 

అయితే తాజాగా ఇప్పుడు అనుష్క నవీన్ పోలిశెట్టి తో కలిసి ఒక సినిమా చేయబోతుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటి అంటే ఈ సినిమా సరోగసి బ్యాక్ డ్రాప్ లో రానుందని  తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో కనిపిస్తుంది. ఇక హీరో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా ఈ సినిమాలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో మెయిన్ పాయింట్ సరోగసి పద్ధతి అనే తెలుస్తోంది. దీంతోపాటు ఈ సినిమాలో అనుష్క సరోగసి మదర్ గా కనిపించనున్నట్లుగా సమాచారం.

అయితే ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత కూడా సరోగసి బ్యాక్ డ్రాప్ లో యశోద సినిమాలో నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సమంత అద్దె గర్భానికి అంగీకరించి యశోద పాత్రలో మనందరినీ ఆకట్టుకుంది. అయితే  అనుష్క నటిస్తున్న ఈ సినిమా కూడా అలానే తెరకెక్కడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇక సమంత నటించిన యశోద సినిమా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కగా ఇప్పుడు అనుష్క నటిస్తున్న సినిమా మాత్రం వన్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో అందరినీ ఆ కొట్టుకుంటుంది అని అంటున్నారు. ఇక అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తన 48వ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.అయితే ఈ సినిమా మహేష్ బాబు పి తెరకెక్కుతుండగా ఈయన గతంలో సందీప్ కిషన్ తో రారా కృష్ణయ్య సినిమాను కూడా చేయడం జరిగింది.ఆ సినిమా తర్వాత ఇప్పుడు అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు మహేష్ బాబు. మహేష్ బాబు మరియు నవీన్ పోలిశెట్టి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి లో విడుదల కానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: