అడవి శేషు.. అక్కినేని సుప్రియ ఎఫైర్ నిజమేనా..?

Divya
టాలీవుడ్లో యంగ్ హీరోలలో పాన్ ఇండియా స్థాయిలో మంచి పాపులారిటీ అందుకున్న హీరో అడవి శేషు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే అక్కినేని కుటుంబం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక అక్కినేని నాగేశ్వరరావు వారసులందరిని ఇండస్ట్రీకి పరిచయం చేసి సొంతంగా వాళ్లే ఎదిగారు. అలా అక్కినేని నాగార్జున స్టార్ హీరోగా మారినా ఆయన వారసులు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నారు.
అయినప్పటికీ టాలీవుడ్ లో మాత్రం అక్కినేని ఫ్యామిలీ అంటే ఒక మంచి పేరు ఉందని చెప్పవచ్చు. ఇక ఈ ఫ్యామిలీ మెంబర్ ఏదైనా సరే ఫంక్షన్ జరిగిన , పండుగ జరిగిన అందరూ కలిసి పోయి సందడి చేస్తూ ఉంటారు. అయితే తాజాగా క్రిస్మస్ పండుగ సందర్భంగా అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి ఒకే ఫోటోలు కనిపించడం జరిగింది.అయితే ఇందులో నాగచైతన్య తప్ప మిగతా వారంతా కలిసి ఈ పండుగను చాలా ఘనంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.అయితే ఇందులో టాలీవుడ్ హీరో అడవి శేషు కూడా కనిపించడం జరిగింది.
దీంతో అటు అడవి శేషు అభిమానులు,అక్కినేని అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ ఫోటోలను అఖిల్ అక్కినేని షేర్ చేయగా ఈ ఫోటోలకు అడవి శేషు అక్కినేని బ్రదర్స్ అంటూ కామెంట్స్ చేశారు. అసలు అడివి శేషు అక్కినేని ఫ్యామిలీ ఎందుకు ఉన్నారు అనే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.కానీ కొంతమంది మాత్రం అక్కినేని అమ్మాయి సుప్రియ తో రిలేషన్ షిప్ లో అడవి శేషు ఉన్నారని వార్తలు గతంలో నుంచి వినిపిస్తూ ఉండేవి ..ఇప్పుడు ఈ వార్తలను నిజం చేస్తున్నారని పలువురు నెటిజల్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై ఎవరు స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: