ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు లక్ష్మి..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపును పొందాడు. ఇక ఆయన వారసులుగా సినీ ఇండస్ట్రీలోకి మంచు మనోజ్, మంచు విష్ణు మరియు మంచు లక్ష్మి ఎంట్రీ ఇచ్చారు. ఇక హీరోగా వీరిద్దరూ మంచి గుర్తింపును తెచ్చుకోవడానికి నానా రకాలుగా ప్రయత్నించారు. అయినప్పటికీ స్టార్ హీరో రేంజ్ పాపులారిటీని మాత్రం ఈ ఇద్దరు దక్కించుకోలేకపోయారు.  మంచు లక్ష్మి అనేక సినిమాల్లో నటించినప్పటికీ హీరోయిన్ గా మాత్రం తన కెరియర్ను కొనసాగించలేదు. అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో లేడీ విలన్ పాత్రలో సినిమా కెరియర్ను

మొదలుపెట్టిన ఈమె దాని అనంతరం కొన్ని సినిమాలలో నటించడం జరిగింది. సినిమాలతో పాటు ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంలో సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది మంచు లక్ష్మి. అయితే సోషల్ మీడియా వేదికగా చాలామంది మంచో ఫ్యామిలీని టార్గెట్ చేసి వారిపై ట్రోల్స్ చేస్తూ ఉండడం చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల అలాంటి ట్రోల్స్ ని భరించలేక మంచు ఫ్యామిలీ సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఇక ఇలాంటివి పట్టించుకోని కొందరు మాత్రం వీరిపై రూల్స్ మాత్రం ఆపడం లేదు. తాజాగా మంచు లక్ష్మి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.  

ఆ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ మంచు లక్ష్మిని పలు రకాల ప్రశ్నలను అడిగింది. అందులో భాగంగా యాంకర్ మీ కుటుంబం మధ్యలో గొడవలు జరుగుతున్నాయట నిజమేనా అని అడగగా దానికి లక్ష్మీ మంచు మా ఫ్యామిలీ అంటే అదే మా పర్సనల్ మా ఇంట్లో ఎప్పుడూ ఏ గొడవలు ఉండవు... విష్ణు తన భార్య పిల్లలు సినిమాలు చూసుకోవడంలో ఎప్పుడు బిజీగా ఉంటారు.. నేను మనోజ్ మాత్రం ఎక్కువగా టైం పాస్ చేస్తూ ఉంటాం ...అంతేగాని మా మధ్య ఎప్పటికీ ఎలాంటి గొడవలు రావు... అంటూ క్లారిటీ ఇచ్చింది మంచు లక్ష్మి .దాంతోపాటు మంచు లక్ష్మి పని పాట లేని వాళ్ళు మా మీద ఇలాంటి రోల్స్ చేస్తూ ఉంటారూ...మా నాన్న  ఎప్పటికీ కింగే అంటూ చెప్పవచ్చింది మంచు లక్ష్మి. ఇందులో భాగంగా ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం అని మై ఫస్ట్ లవ్ ప్రభాస్ అని ఛాన్స్ వస్తే ప్రభాస్ సినిమాలో కూడా నటిస్తాను అంటూ చెప్పకు వచ్చింది మంచు లక్ష్మి ...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: