2023 ఇయర్ నిధి ఊపేయడం ఖాయమా..!

shami
అంతకుముందు అక్కినేని హీరోలిద్దరితో జోడీ కట్టిన ముంబై భామ నిధి అగర్వాల్ తన కెరీర్ లో మొదటి హిట్ ఖాతా తెరచింది మాత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమాతోనే. రాం, పూరి కంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నిధి అగర్వాల్ తన అందాలకు బాగా పని చెపేసింది. అక్కడ ఉంది పూరీ కాబట్టి హీరోయిన్ ని ఎలా చూపించాలో అతనికి బాగా తెలుసు. అందుకే నిధి ముందు చేసిన రెండు సినిమాలు మర్చిపోయి ఇస్మార్ట్ శంకరే తన మొదటి సినిమా అనేలా గుర్తింపు తెచ్చుకుంది.
ఆ దెబ్బతో అమ్మడు వరుస తమిళ సినిమాలు చేయడం అక్కడ వీరాభిమానులు ఏర్పడటం జరిగింది. ప్రస్తుతం తెలుగు లో పవర్ స్టార్ తో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్న నిధి అగర్వాల్ ఆ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది. అంతేకాదు 2023 లో అమ్మడి సినిమాలు మూడు దాకా రిలీజ్ ఉండటంతో వచ్చే ఏడాది నిధి ఊపేయడం ఖాయమని అంటున్నారు. నిధి అగర్వాల్ ఈపాటికే ఇంకాస్త స్పీడ్ అందుకోవాల్సి ఉన్నా తన దగ్గరకు వచ్చిన దర్శక నిర్మాతల నే అమ్మడు అప్రోచ్ అవుతుంది.
గల్లా అశోక్ తో కూడా జోడీ కట్టిన ఆమె యువ హీరో ల సరసన ఎందుకు కాదంటుంది చెప్పండి. కాకపోతే అమ్మడు కొద్ది గా రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేస్తుంది. అందుకే మనవాళ్లు కొద్ది గా అటు ఇటుగా ఆలోచిస్తున్నారు. నిధిని చూస్తే ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ చేతిలో తెలుగు సినిమాలు మాత్రం అసలు ఉండట్లేదు. దీనికి కారణం మాత్రం ఆమె రెమ్యునరేషన్ ఒక్కటే అన్నట్టు చెబుతున్నారు. మరి కెరీర్ సాఫీగా సాగాలంటే కొన్ని పట్టువిడుపులు ఉండాలి. కాబట్టి నిధి ఇక మీదట అయినా కొద్దిగా జాగ్రత్త పడితే బెటర్ అని అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: