మళ్ళీ కలిసిపోయిన షణ్ముక్-దీప్తి సునైన..!?

Anilkumar
సోషల్ మీడియాలో షణ్ముఖ్ జస్వంత్ మరియు దీప్తి  ఫాలోయింగ్ ఎలా అంటుందో మనందరికీ తెలిసిందే. మాటీవీలో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న షణ్ముఖ్ మరియు సిరి హద్దులు దాటి ప్రవర్తించడంతో వీరిద్దరికి బ్రేకప్ అయ్యింది. ఇక బిగ్ బాస్ లో వారిద్దరూ ముద్దులు హక్కులతో రెచ్చిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే షో ఆఖరిలో షణ్ముఖను కలిసేందుకు దీప్తి సునైనా రావడం జరిగింది. అంతేకాదు ఆ సమయంలో షణ్ముఖ్ తో చాలా ప్రేమగా మాట్లాడింది. ఇక ఆ సమయంలో షణ్ముఖ్  మరియు సిరిల వ్యవహారం పట్ల ఈమె హర్ట్ కాలేదు అని చాలామంది భావించారు. 

ఇక షణ్ముఖ్  ఆ సీజన్ విన్నర్ అవ్వాలి అని దీప్తి సునైనా బయట ఎన్నెన్ని ప్రయత్నాలు చేసిందో చాలామందికి తెలిసి ఉంటుంది. కానీ ఆఖరికి షణ్ముఖ రన్నర్ అయ్యాడు. అనంతరం షో ముగిసి షణ్ముఖ్  బయటకు వచ్చిన తరువాత దీప్తి సునైనా షణ్ముఖ్ కి ఎవరు ఊహించని రీతిలో  బ్రేకప్ చెప్పడం జరిగింది. ఇక తన బ్రేకప్ వ్యవహారాన్ని దీప్తి  నేరుగా తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టును షేర్ చేసింది. షణ్ముఖ్ తో నేను విడిపోతున్నాను అన్నట్లుగా ఆమె పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వీరి అభిమానులు షాక్ అయ్యారు. వీరి బ్రేకప్ వార్త విన్న అనంతరం చాలామంది సిరి కారణంగానే వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు

అన్న వార్తలు సైతం అప్పట్లో జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. బ్రేకప్ అనంతరం ఎవరి పనులలో వారు బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా దీప్తి సునైనా షణ్ముఖ్ తో కలిసి ఒక పాటలో పాల్గొంటున్నట్లుగా చెప్పడం జరిగింది. ఇందుకుగాను దీప్తి సునైనా షణ్ముఖ్ మేము కలిసి ఒక ఆల్బమ్ ను త్వరలోనే చేస్తున్నాము. అంతేకాదు త్వరలోనే ఈ ఆల్బమ్ ను  మీ ముందుకు తీసుకువస్తాము అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ వార్త విన్న వీరి అభిమానులు సంవత్సరం పాటు దూరంగా ఉన్న వీరిద్దరూ మళ్లీ కలిసి పోయారేమో అందుకే కలిసి ఆల్బమ్ సాంగ్ ను చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ మల్లి కలిసిపోయారా లేదా అన్నది వారి నోటితో చెబితే గాని ఆ విషయంపై క్లారిటీ రాదు...!!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: