పవన్ మామిడిపండ్లు అన్న క్రిస్మస్ గిఫ్ట్స్ !

Seetha Sailaja
సమ్మర్ వచ్చింది అంటే చాలు పవన్ కళ్యాణ్ తన ఫామ్ హౌస్ లో పండిన వివిధ రకాల మామిడి పండ్లను ఇండస్ట్రీలోని అనేకమంది ప్రముఖులకు అదేవిధంగా తన సన్నిహితులకు పంపుతూ ఉంటాడు. వాస్తవానికి పవన్ ఇలా మామిడిపండ్లు పంపుతాడు అన్న విషయం యంగ్ హీరో నితిన్ బయటపెట్టే వరకు ఎవరికీ తెలియదు.

ఇంకా వేసవి కాలం రావడానికి చాల నెలలు పట్టే అవకాశం ఉన్నప్పటికీ ఈసారి పవన్ భార్య అన్నా క్రిస్మస్ గిఫ్ట్స్ ను పవన్ తో సన్నిహితంగా ఉండే నిర్మాతలకు దర్శకులకు మీడియా ప్రతినిధులకు పంపినట్లుగా సోషల్ మీడియాలో వార్తల హడావిడి జరుగుతోంది. అన్నా పంపిన గిఫ్ట్ బాక్స్ లకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

'అన్నా పవన్ కళ్యాణ్' అన్న సంతకంతో ఈ గిఫ్ట్ బాక్స్ లో లెటర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈమధ్య కాలంలో అన్నా పవన్ లు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేసిన సందర్భం చాల అరుదుగా కనిపించాయి. ఇప్పుడు వీరిద్దరి సంతకంతో క్రిస్మస్ గిఫ్ట్స్ బయటకు రావడంతో మళ్ళీ సోషల్ మీడియాలో అన్నా ప్రస్తావన బయటపడింది. గత ఎన్నికల ప్రచారానికి పవన్ బయలుదేరే ముందు అన్నా పవన్ నుదుటి పై తిలకం దిద్ది హారతులు ఇచ్చిన ఫోటోలు అప్పట్లో వైరల్ గా మారాయి. త్వరలో పవన్ కళ్యాణ్ ‘వారాహి’ రథం పై నిలబడి ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రచారం చేయబోతున్నాడు. ఆ ప్రచారానికి కూడ అన్నా పవన్ కు వీరతిలకం దిద్దే ఆస్కారం కనిపిస్తోంది.

హిందూ మత ధర్మాలను పూజలను బాగా విశ్వసించే పవన్ అన్నా ప్రభావంతో బైబిల్ గురించి కూడ బాగా అవగాహన ఏర్పరుచు కోవడమే కాకుండా ప్రతి క్రిస్మస్ కు తన భార్య అన్నా పిల్లలతో కలిసి క్రిస్మస్ ను చాల ఆనందంగా జరుపుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం అన్నా అందరికీ పంపిన గిఫ్ట్స్ పవన్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: