ఆ విషయంలో తగ్గేదెలే అంటున్న బన్నీ భార్య.. ఏకంగా స్టార్ హీరోయిన్స్ ను మించేలా..?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తనదైన శైలిలో ఆమె ఫోటోలని ఎప్పటికప్పుడు ఆమె సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. దీంతో ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. అయితే మొదట్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఇంటికే పరిమితమైన ఇల్లాలు లాగా కనిపించేది. సాధారణంగా స్టార్ హీరోల భార్యలు సోషల్ మీడియా ముందుకు రావడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ ఇప్పుడు మాత్రం తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవాలని సోషల్ మీడియా వేదికగా వారి ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతున్నారు.

 ఇక ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న కొందరు హీరోల భార్యలు మాత్రమే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఇక వారిలో నమ్రత స్నేహ రెడ్డి ఒకరు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత ఒకప్పటి మిస్ ఇండియా అనే సంగతి మనందరికీ తెలిసిందే.అందుకుగాను ఈమె తన ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. కానీ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తనకి సంబంధించిన గ్లామరస్ ఫోటోలను ఊహించని విధంగా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. గత రెండేళ్లుగా స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనదైన స్టైల్ లో ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది.

అయితే తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫోటోషూట్లని చేస్తోంది. అంతేకాదు వాటికి సంబంధించిన ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంది. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి స్టార్ హీరోయిన్ల అందాన్ని కలిగి ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే స్టార్ హీరోయిన్స్ అందానికి మించి స్నేహ రెడ్డి అందం ఉంటుంది. దీంతో ఈమె గురించి సోషల్ మీడియాలో అనేకమైన వార్తలు సైతం వస్తున్నాయి. అయితే స్నేహ రెడ్డి ఒక స్టార్ హీరో సినిమాలో నటించబోతుంది అనే వార్తలు ఎప్పటినుండో వస్తున్నాయి. ఇక ఈ వార్తలు నిజమో కాదో తెలియదు గాని. తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు కాస్త ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: