సిరి,షణ్ముఖ్ రిలేషన్ పై శ్రీహాన్ ఏమన్నాడంటే?

Satvika
బిగ్ బాస్ ద్వారా కొందరి జీవితాలు బాగు పడితే..మరి కొందరి జీవితాలు మాత్రం రూమర్స్ కు కెరాఫ్ గా నిలిచాయి..అందులోనూ బిగ్ బాస్ 5 లో మరీ దారుణం అనే చెప్పాలి. ఈ తెలుగు సీజన్ లో సిరి ,షణ్ముఖ్ కూడా వున్నారు..వారి పై బయట ఎన్ని రుమెర్స్ వచ్చాయో మనందరికీ తెలుసు..బయట లవర్స్ వున్నా కూడా ఇలా చెయ్యడం తప్పు అంటూ అప్పటిలో బాగానే మాటలు అందుకున్నారు ఆ జంట. ఆ రుమెర్స్ వల్లే షణ్ముఖ్ దీప్తి సునైనా విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. షణ్ముఖ్ దీప్తి మళ్లీ కలిసే అవకాశాలు కూడా కనిపించడం లేదనే సంగతి తెలిసిందే. సిరి శ్రీహాన్ కూడా విడిపోతారని కొంతమంది భావించినా ఆ వార్తలు నిజం కాలేదు..వారిద్దరు కలిసి ఎంజాయ్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా..సిరి షణ్ముఖ్ రిలేషన్ గురించి తాజాగా శ్రీహాన్ కొన్ని నిజాలను బయట పెట్టారు.. అవి ఇప్పుడు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీసత్యతో ఉన్న బంధం గురించి శ్రీహాన్ ను అడగగా బిగ్ బాస్ హౌస్ లో మానసికంగా దగ్గరయ్యే పరిస్థితులు ఉన్నాయని శ్రీహాన్ తెలిపారు. గతేడాది సిరి విషయంలో కూడా ఇదే విధంగా జరిగిందని శ్రీహాన్ స్పా. సిరి షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న పరిస్థితుల వల్లే సన్నిహితంగా ఉన్నారని శ్రీహాన్ పేర్కొన్నారు...అది కేవలం ఒక స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందని ఆయన అన్నారు..

శ్రీహాన్ చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ ను వీడి కంటెస్టెంట్లు ఎక్కడికీ వెళ్లే పరిస్థితి ఉండదు. అందువల్లే అక్కడే ఉన్న కంటెస్టెంట్ల మధ్య అనుబంధం పెరుగుతుంది.మెమంతా ఒకటే అనే ఫీలింగ్ వుంటుంది..ఆ క్రమంలో కొందరైతే కాస్త క్లోజ్ అవుతారు.. అయితే బయట ప్రపంచం నుంచి వాళ్లను చూసేవాళ్లకు మాత్రం కొన్ని సందర్భాల్లో అది తప్పుగా కనిపించే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. బిగ్ బాస్ షో వల్ల కొన్ని జంటలు కలుస్తుంటే కొన్ని జంటలు విడిపోతున్నాయి... ప్రేమలో నమ్మకం అనేది ఉండాలి..ఇది గుర్తుంచుకోండి... అప్పుడే ఎ రిలేషన్ అయిన స్ట్రాంగ్గా వుంటుందని శ్రీహాన్ అన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: