రాంచరణ్ వేసుకున్న ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా...?

murali krishna
రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ ఇప్పుడు ఆ రేంజ్ సినిమాలతో చాలా బిజీగా మారాడు. ఇక మరోపక్క భార్య ప్రెగ్నెంట్ కావడంతో చరణ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పవచ్చు.
ఇకపోతే మొదటి నుంచి చరణ్ పక్కా స్టైలిష్ లుక్ లో అదరగొడుతుంటాడు. ముఖ్యంగా చరణ్ వాడే వాచ్ , షర్ట్ లు ధరలు వింటే మనకు దిమ్మ తిరిగిపోతూ ఉంటాయి. ఇక ఈ మధ్యనే ఉపాసన వేసుకున్న ఒక రెడ్ డ్రెస్ ధర లక్ష పైనే అని తెలుస్తుంది.. దానికి అందరు కూడా ఆశ్చర్య పోయారు.. ఇక తాజాగా చరణ్ సెమీ క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్న సంగతి తెల్సిందే. మెగా కజిన్స్ అందరు కూడా ఒక దగ్గర చేరి సరదాగా సెమీ క్రిస్మస్ జరుపుకున్నారు..
ఇక ఈ ఫోటోలు గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియా లో తెగ కుదిపేస్తున్నాయి. అందులో అందరి చూపు అంతా చరణ్ వేసుకున్న షర్ట్ పైనే ఉండడంతో .. ఆ షర్ట్ ధర ఎంతో తెలుసుకోవాలని అందరూ అభిమానులు ఆశపడి షర్ట్ ధర తెలిశాకా ఆశ్చర్యపోయారు.అవును ఆ ఒక్క షర్ట్ ధర అక్షరాలా.. రూ.1,21,840. లైట్ బ్లూ కలర్ షర్ట్ పై ప్యాచ్ డిటైల్ వర్క్ కూడా చేయబడింది. ఈ షర్ట్ బ్రాండ్ వచ్చేసి జున్యా వతనాబే అని సమాచారం.. ఇక ఈ ధర చూసి అభిమానులు కూడా ఆశ్చర్య పోతున్నారు.. ఏంటి బ్రో ఒక షర్ట్.. లక్షా పాతిక వేలా.. నలుగురు స్లైస్ కార్డుల బిల్ అయితే కట్టొచ్చు.. ఒక మిడిల్ క్లాస్ యువకుడి నాలుగు నెలల జీతం అని చెప్పుకొస్తున్నారు. ఇక మరికొంతమంది ఏదిఏమైనా ఆ షర్ట్ చరణ్ కు చాలా బావుంది.. మెగా పవర్ స్టార్ అంటే ఆ మాత్రం రేంజ్ అయితే ఉండాలి కదా అంటూ చెప్పుకొస్తున్నారటా.. ప్రస్తుతం ఈ ఫోటోలు అయితే నెట్టింట తెగ వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: