శివాత్మిక అసలైన అందం చూశారా..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా సినీ బ్యాగ్రౌండ్ ఉన్న వారసుల సైతం ఎంట్రీ ఇస్తున్న పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు. అలాంటి వారిలో శివాత్మిక రాజశేఖర్ కూడా ఒకరు. తరచూ ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. ఎన్నో చిత్రాలలో నటించిన ఇప్పటివరకు చెప్పుకోదగ్గ సక్సెస్ కూడా రాలేదని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే అందాలతో మేకర్స్ దృష్టిని ఆకర్షించే విధంగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో పలు హాట్ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటోంది.

శివాత్మిక నటించిన తాజా మూవీ పంచతంత్రం డిసెంబర్ 9న విడుదలై ప్రేక్షకులను కదిలించే సామాజిక కోణాల కథలుగా తీసుకువచ్చిన ఈ చిత్రం ఎమోషనల్ డ్రామా గా బాగానే ఆకట్టుకుంది.కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది.ఈ క్లాస్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేక పోతున్నారు. కానీ హీరో రాజశేఖర్ జీవిత వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక 2019లో విడుదలైన దొరసాని సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఇందులో ఆనంద దేవరకొండ హీరోగా నటించారు. ఈ చిత్రం కూడా పాజిటివ్ తక్కువ వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.

ప్రస్తుతం రంగమార్తాండ సినిమాలో శివాత్మిక నటిస్తోంది. డైరెక్టర్ కృష్ణవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. రమ్యకృష్ణ కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండగా ప్రకాష్ రాజ్ ,బ్రహ్మానందం కూడా నటిస్తున్నారు.ఈ చిత్రం మరాఠీ చిత్రం నుంచి రీమేక్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో కూడా శివాత్మికకు పలు ఆఫర్లు వెలుబడుతున్నాయట. అయితే ఇప్పటివరకు ఈమెకు చెప్పుకోదగ్గ పాత్ర ఈమె దగ్గరకు రాలేదని తెలియజేస్తోంది. కనీసం స్టార్ హీరోల చిత్రాలను సెకండ్ హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిన కూడా వదలను అంటోంది శివాత్మిక. ఇప్పుడిప్పుడే నాటిక ఎదగడానికి ప్రయత్నం చేస్తున్న శివాత్మిక కెరియర్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: