సినిమాలు... చదువు సరిగ్గా బ్యాలెన్స్ చేయడానికి నా తల్లి ఎంతో సహకరిస్తుంది శ్రీ లీల..!

Pulgam Srinivas
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలతో అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న యంగ్ హీరోయిన్ లలో శ్రీ లీల ఒకరు. ఈ ముద్దుగుమ్మ శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకేక్కిన పెళ్లి సందD మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ లోనే తన అద్భుతమైన నటనతో ... అంతకుమించిన అంద చందాలతో మరియు డ్యాన్స్ తో తెలుగు సినీ ప్రేమికులను కట్టిపడేసింది.

దానితో ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. తాజాగా శ్రీ లీల "ధమాకా" అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. రవితేజ ఈ మూవీ లో హీరోగా నటించగా , ఈ మూవీ కి త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ తో శ్రీ లీల ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ లీల ఎంబిబిఎస్ ఫైనల్ ఎగ్జామ్స్ రాసింది.

తాజాగా శ్రీ లీల తాను సినిమాలు మరియు చదువును సరిగ్గా బ్యాలెన్స్ చేయడానికి తన తల్లి తనకు ఎంతో సహకరిస్తుంది అని చెప్పుకొచ్చింది. శ్రీ లీల ప్రస్తుతం రామ్ పోతినేని ... బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే నితిన్ ... వక్కంతం వంశీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. వీటితో పాటు నందమూరి నటసింహం బాలకృష్ణ ... అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ లో కూడా బాలకృష్ణ కు కూతురుగా నటించబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: