ఆ దర్శకులకు ఎన్టీఆర్ మరో ఛాన్స్ ఇస్తే నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా..!?

Anilkumar
కొంతమంది దర్శకులకు మంచి ప్రతిభ ఉన్నప్పటికీ కొన్ని కారణాలవల్ల ఆ దర్శకుల సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. ఒక ఇద్దరు దర్శకులు తప్ప ఇండస్ట్రీలోనే చాలామంది దర్శకులు కెరియర్లో ఒక్క ఫ్లాప్ వల్ల అయినా ఇబ్బందులు పడిన సందర్భాలు చాలానే ఉంటాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చినా కొంతమంది దర్శకులు ఆయన నమ్మకాన్ని ఇప్పటికీ నిలబెట్టలు పోలేక పోయారు. ఎన్టీఆర్ మళ్ళీ రాబోయే రోజుల్లో చాన్స్ ఇస్తే  ఈ దర్శకులు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారో లేదో చూడాలి. ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో అశోక్, ఊసరవెల్లి సినిమాలు  వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచాయి.

ఇక సురేందర్ రెడ్డి సినీ కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ ఇట్లు ఉన్న... తారక్కు సరైన సక్సెస్ ఇవ్వలేకపోయారు. ఈ దర్శకుడికి రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ ఛాన్స్ ఇస్తాడా లేదా అన్నది చూడాలి. దాని తర్వాత ఎన్టీఆర్ మరియు మోహన్ రమేష్ కాంబినేషన్లో కంత్రి ,శక్తి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. కంత్రి సినిమా కలెక్షన్ల పరంగా యావరేజ్ గా నిలిచినప్పటికీ శక్తి మూవీ ఫ్లాప్ అయింది. ఎన్టీఆర్ మోహన్ రమేష్ కాంబినేషన్ లో మరో సినిమా వద్దు అని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు. ఎన్టీఆర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో దమ్ము సినిమా హీరోయిన్ల ఎంపికలో చేసిన తప్పుల వల్ల ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది.

ఇక బాలయ్యకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను తారక్ తో మరో సినిమా చేసి ఎన్టీఆర్ కి హిట్ అందిస్తాడా లేదా చూడాలి. దాని అనంతరం తారక్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్లో మూవీకి మొదట అనుకున్న కదా ఒకటి అయినా... ఆ కథ అదే సమయంలో విడుదలైన రెబల్ సినిమాకు పోలి ఉండడంతో సరికొత్త కదా రామయ్య వస్తావయ్య అనే సినిమాను తెరకెక్కించాడు. ఇక సెకండ్ హాఫ్ రొటీన్ గా ఉండడంతో ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ మరో ఛాన్స్ ఇస్తే గనక కచ్చితంగా చూస్తున్నట్లుగా తెలుస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ బాగుంటుంది అని హరీష్ శంకర్ కి మరో ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. దీంతో ఎన్టీఆర్ ఈ దర్శకులు మరో ఛాన్స్ ఇస్తాడా అన్నది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: