బాలయ్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన నయనతార..!?

Anilkumar
టాలీవుడ్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ గా పేరు తెచ్చుకున్న బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన ఈ వయసులో కూడా యంగ్ హీరోలకి పోటీగా ప్రస్తుతం వరుస  సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు బాలయ్య. గతేడాది బాలయ్య నటించిన అఖండా సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తాజాగా బాలయ్య నటించిన వీరసింహారెడ్డి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానంది. దీంతో బాలయ్య సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని బాలయ్య అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

అయితే ఈ క్రమంలోనే  అన్ స్టాపబుల్ షో తో ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు నందమూరి బాలకృష్ణ. అయితే ఈ షోలోని కొత్త కోణాన్ని చూడగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో ఎలా కలిసిపోతాడో తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చిన్నపిల్లాడి లాగా బాలకృష్ణ చేస్తున్న అల్లరి అందరికీ నచ్చుతుంది. అయితే ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ అయిన నాయనతార నందమూరి బాలకృష్ణపై షాకింగ్ కామెంట్స్ చేసింది. కనెక్ట్ అనే హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది నయనతార. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా 

ఒక ఇంటర్వ్యూలో  ఈ వయసులో కూడా యంగ్ హీరోలకి పోటీగా ప్రస్తుతం వరుస  సినిమాలను చేసుకుంటూ పోతున్న  బాలకృష్ణతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకొచ్చింది నయనతార. బాలకృష్ణ సార్ తో నేను డిఫరెంట్ జూనియర్స్ లో సినిమాలు చేశాను. ఆయన్ని చూసి అందరూ భయపడతారు కానీ బాలకృష్ణ సార్ చాలా సరదాగా ఉంటారు. చాలా మంచి మనిషి. గతంలో తాను ప్రభాస్ చాలా ఆకతాయి వ్యక్తి అని చెప్పాను. కానీ బాలకృష్ణ సార్, ప్రభాస్ కంటే పెద్ద ఆకతాయి అంటూ చెప్పుకొచ్చింది నయనతార. అయితే ప్రస్తుతం నయనతార నందమూరి బాలకృష్ణ పై చేసిన ఈ కామెంట్లు కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: