ఎన్టీఆర్ సినిమాకి జాన్వీ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న  సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ సెలెక్ట్ అయ్యింది అనే వార్తలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ వార్త నిజమే అని తెలుస్తోంది. అయితే ఫిబ్రవరి నుంచి ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఇక మొదటిసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్న జాన్వి మాత్రం రెమ్యూనరేషన్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈమె అప్కమింగ్ సినిమా కోసం

 ఏకంగా నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పటినుండో తెలుగులో ఎంట్రీ ఇస్తుంది అంటూ ఈమెకి సంబంధించి అనేకమైన వార్తలు వస్తున్నప్పటికీ ఈమె బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇక మరోవైపు శ్రీదేవి బోని కపూర్ కూతురు అన్న బ్రాండ్, బ్యాక్ గ్రౌండ్ ఉన్న కూడా  హిందీలో మాత్రం పెద్దగా ఈమెకి చెప్పుకోదగ్గ హిట్ లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సిల్వర్ స్క్రీన్ తో పాటు ఓటిటి ప్రాజెక్టులు కూడా ఈమె చేసినప్పటికీ అక్కడ కూడా సరైన హిట్ అందుకోలేకపోయింది.

దాంతో తన తల్లి శ్రీదేవికి పేరు తెచ్చి పెట్టిన తెలుగు ఇండస్ట్రీ వైపే ఫోకస్ పెట్టింది అని వార్తలు వినిపిస్తున్నాయి. పైగా తారక్ కొరటాల సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం తో ఈ సినిమాతో ఈమె మంచి హిట్ అందుకుంటే బాగుంటుంది అని ఈమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇక మరోవైపు ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ సినిమా అనంతరం ఒక బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలన్న ఆశతో ఉన్నాడు కొరటాల. దీంతో జాన్వి మొదటి సినిమాకి ఇంత రెమ్యూనరేషన్  డిమాండ్ చేయడంతో ఈ వార్త కాస్తా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: