రామ్ చరణ్-శంకర్ సినిమా లో ఆ స్టార్ హీరో..ఏకంగా అలాంటి పాత్రలో..!?

Anilkumar
త్రిబుల్ ఆర్ సినిమా అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ తో సినిమా విషయంలో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక తాజాగా త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న రామ్ చరణ్ కేవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ భారీ విజయాన్ని అందుకున్నాడు. అయితే ముఖ్యంగా జపాన్ లో అక్కడ రికార్డులను బ్రేక్ చేసింది త్రిబుల్ ఆర్ సినిమా.అయితే మొన్నటి వరకు సూపర్ స్టార్ రజినీకాంత్ ముత్తు పేరు ఉన్న రికార్డును కూడా త్రిబుల్ ఆర్ తన పేరుకు మార్చుకుంది. 

అయితే త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్ కి  పోటీగా నటించాడు రామ్ చరణ్. ఇక పోలీస్ ఆఫీసర్ అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ ప్రేక్షకులను ఫిదా చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తాజాగా  ఇప్పుడు మరో టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు రామ్ చరణ్. ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ లో ఉంది.స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. వారితోపాటు సునీల్,

 శ్రీకాంత్, అంజలి కీలక పాత్రల్లో కనిపించే బోతున్నారని తెలుస్తుంది. అయితే పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా ఉన్నారని తెలుస్తుంది.  స్టార్ హీరో మోహన్ లాల్ చరణ్  ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో మోహన్ లాల్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ వార్త నిజమో కాదో తెలియదు గానీ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా అవుతున్న ప్పటికీ వచ్చే ఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా విడుదల కానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: