మరో వెబ్ సిరీస్ తో రానున్న రెజీనా కసాండ్రా.. మెప్పిస్తుందా..?

Divya
అందం, అభినయం ఉన్నా కూడా స్టార్ హీరోయిన్ కాలేకపోయినా రెజీనా కసాండ్రా ఇప్పటివరకు ఒక స్టార్ హీరో పక్కన అవకాశాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. నటనలో మంచి పర్ఫామెన్స్ ఇచ్చినా కూడా ఈమెకు ఆఫర్లు రాలేదని చెప్పాలి. ఈమెతో పాటు వచ్చిన హీరోయిన్లు మొత్తం స్టార్ హీరోయిన్లయినా కూడా ఈమె మాత్రం ఇప్పటికీ అక్కడే ఉండిపోయింది. అంతేకాదు ఇప్పటికే తన కెరీర్ను ఎలా మార్చుకోవాలో అర్థం కావడం లేదు ఈ ముద్దుగుమ్మకు.. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ భాషల్లో కూడా నటించిన ఈమె చెన్నైలో జన్మించింది. తెలుగులో నటించిన శివ మనసులో శృతి.. రొటీన్ లవ్ స్టోరీ.. కొత్తజంట.. వంటి సినిమాలలో తాను నటించిన పాత్రల ద్వారా మరింత గుర్తింపు పొందింది.
రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన పిల్ల నువ్వు లేని జీవితం సినిమాలో సాయిధరమ్ తేజ సరసన నటించింది. కానీ అనుకున్నంత విజయాన్ని పొందలేకపోయింది. ఆ తర్వాత రారా కృష్ణయ్య , పవర్ వంటి చిత్రాలలో కూడా నటించింది.  తెలుగులోనే కాకుండా తమిళ్ , కన్నడ భాషల్లో కూడా చిత్రాలు చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈమె 1990 డిసెంబర్ 13న మద్రాస్ లో జన్మించింది. ఇప్పటికీ 32 సంవత్సరాల వయసులో అడుగుపెట్టిన ఈమె పెళ్లి అనే మాటకి దూరంగా ఉంది. ఇకపోతే  2019లో హిందీలో ఏ లడికి తో హైసా లాగా అనే సినిమాలో కూడా నటించింది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం సినిమాలలో ఆఫర్లు రావట్లేదని వెబ్ సిరీస్ ల వైపు మొగ్గు చూపుతున్న ఈమె తాజాగా షాకిని డాకిని సినిమాతో ప్రేక్షకులను అలరించింది. అనన్య నాగళ్ళతో కలిసి నటించిన అన్యాస్ ట్యుటోరియల్ అనే వెబ్ సిరీస్ లో నటించగా అది నేరుగా ఆహా ఓ టీ టీ లో విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా sony Live కోసం మరొక వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మరి ఈ వెబ్ సిరీస్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: