"లాఠీ" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి... రన్ టైమ్ లాక్..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి విశాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశాల్ తాను నటించిన పందెం కోడి మూవీ ని తెలుగు లో విడుదల చేసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. అలాగే విశాల్ ఇప్పటికే తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో విడుదల చేసి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా విశాల్ "లాఠీ" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ని డిసెంబర్ 22 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా , వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది.  లాఠీ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ మూవీ 2 గంటల 24 నిమిషాల మామూలు నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: